Hamas Commander Killed : సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో తమ టాప్ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతిచెందినట్లు హమాస్ తెలిపింది. ఈ మేరకు హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు మరణించిన హమాస్ మిలిటెంట్లలో నొఫాల్ అత్యంత కీలకమైన హమాస్ కమాండర్ కావడం గమనార్హం.
మరోవైపు, ఇజ్రాయెల్‌పై లెబనాన్ రెండు యాంటీ ట్యాంగ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో తమ ఇద్దరు సైనికులతో పాటు మరో పౌరుడు గాయపడ్డాడని చెప్పింది.
-
#WATCH | Israel Defense Forces (IDF) tweets, "We just eliminated Ayman Nofal, a senior Hamas operative. Nofal was the Commander of Hamas’ Central Brigade in Gaza and the former Head of Military Intelligence. Nofal directed many attacks against Israeli civilians and besides being… pic.twitter.com/OZOXwyUUWI
— ANI (@ANI) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Israel Defense Forces (IDF) tweets, "We just eliminated Ayman Nofal, a senior Hamas operative. Nofal was the Commander of Hamas’ Central Brigade in Gaza and the former Head of Military Intelligence. Nofal directed many attacks against Israeli civilians and besides being… pic.twitter.com/OZOXwyUUWI
— ANI (@ANI) October 17, 2023#WATCH | Israel Defense Forces (IDF) tweets, "We just eliminated Ayman Nofal, a senior Hamas operative. Nofal was the Commander of Hamas’ Central Brigade in Gaza and the former Head of Military Intelligence. Nofal directed many attacks against Israeli civilians and besides being… pic.twitter.com/OZOXwyUUWI
— ANI (@ANI) October 17, 2023
పదుల సంఖ్యలో పౌరుల మృతి..
Gaza Situation Now : ఉత్తరగాజాను ఖాళీ చేయమని పాలస్తీనా ప్రజలను ఆదేశించిన ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై కూడా బాంబుదాడులకు దిగింది. ఇప్పటికే 10 లక్షల మందికిపైగా ఉత్తరగాజాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్నారు. దక్షిణగాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రఫా నగరంలో 27 మంది, ఖాన్ యూనిస్ నగరంలో 30 మంది మరణించినట్లు హమాస్ అధికారులు తెలిపారు.
భీకరంగా పరస్పర దాడులు..
Israel Hamas War Death Toll : గాజా పౌరులకు సహాయక సామగ్రి అందించడానికి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే గాజాలో ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. అయితే తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఇప్పటివరకు 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 వేల మందికిపైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు హమాస్ రాకెట్లను ప్రయోగిస్తుండటం వల్ల ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులను ఆపడం లేదు.
స్టాండ్బైలో ఇజ్రాయెల్ సేనలు..
Israel Hamas Attack : ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఎటు చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఈ శిథిలాల్లో 1,200 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గాజాలో ఆహారం, నీరు, ఇంధన కొరత నెలకొంది. కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాజా నగరంలో సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశారు. ఇందులో కొందరు వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాజాపై భూతల దాడికి దిగేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. దీనిపై రాజకీయ నిర్ణయం కోసం వేచి చూస్తోంది.
అదే జరిగితే.. వేలాది ప్రాణాలు గాల్లో..
Gaza Situation Now : ఇంధన కొరత కారణంగా ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వేలాది మంది ప్రాణాలు కోల్పోతారని సహాయక బృందాలు పేర్కొన్నాయి. మరోవైపు రఫా సరిహద్దు మీదుగా గాజాలోకి ప్రవేశించేందుకు సహాయ సామగ్రితో ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 300 టన్నుల ఆహారం ఉంది. వందలాది మంది గాజా నుంచి ఈజిప్టులోకి ప్రవేశించేందుకు అక్కడ వేచి ఉన్నారు. రఫా సరిహద్దు తెరిచేందుకు కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు యత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఈ సరిహద్దు మార్గాన్ని గతవారం మూసివేయాల్సి వచ్చింది. సహాయక సామగ్రి గాజా చేరేందుకు అమెరికా కూడా ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు తమ వద్ద 200 నుంచి 250 మంది బందీలు ఉన్నట్లు హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.
కొనసాగుతున్న ఆపరేషన్ అజయ్..
Operation Ajay Israel : ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడానికి చేపట్టిన ఆపరేష్ అజయ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి మరో బ్యాచ్ మంగళవారం దిల్లీకి చేరుకుంది.
-
VIDEO | Another batch of Indians set to leave Tel Aviv, Israel for New Delhi by special flight being operated under 'Operation Ajay'.
— Press Trust of India (@PTI_News) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: EFE/ PTI)#IsraelGazaWar pic.twitter.com/HkDuZj5kXT
">VIDEO | Another batch of Indians set to leave Tel Aviv, Israel for New Delhi by special flight being operated under 'Operation Ajay'.
— Press Trust of India (@PTI_News) October 17, 2023
(Source: EFE/ PTI)#IsraelGazaWar pic.twitter.com/HkDuZj5kXTVIDEO | Another batch of Indians set to leave Tel Aviv, Israel for New Delhi by special flight being operated under 'Operation Ajay'.
— Press Trust of India (@PTI_News) October 17, 2023
(Source: EFE/ PTI)#IsraelGazaWar pic.twitter.com/HkDuZj5kXT
Israel Hezbollah War : హెజ్బొల్లా ముప్పు.. ఇజ్రాయెల్ కొత్త వ్యూహం.. ఆ 'రాక్షసుడే' టార్గెట్!