ETV Bharat / international

Hamas Israel War : హమాస్​ను దెబ్బకొట్టేందుకు ఇజ్రాయెల్ పక్కా ప్లాన్​.. గాజాను పూర్తిగా దిగ్భందించాలని ఆదేశాలు - హమాస్ దాడిలో విదేశీయులు మృతి

Hamas Israel War : హమాస్​ను కట్టడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. గాజాను పూర్తిగా దిగ్భందించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సైనికులను ఆదేశించారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన పాశవిక దాడిలో విదేశీయులు డజన్ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌, థాయ్‌లాండ్‌, అమెరికా, బ్రిటన్‌, కెనడా దేశాలకు చెందిన పలువురిని ముష్కరులు చంపేశారు. మరికొందరు విదేశీయులను హమాస్‌ బందీలుగా చేసుకుంది.

Hamas Attack On Israel
Hamas Attack On Israel
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 3:25 PM IST

Hamas Israel War : ఇజ్రాయెల్​ సైన్యం, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్​కు చెందిన వందలాది పౌరులు మరణించారు. అలాగే ఇజ్రాయెల్ గాజాపై జరిపిన ప్రతీకార దాడిలో 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గాజాపై పూర్తి పట్టు సాధించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గాజాను పూర్తిగా దిగ్భందించాలని సైనికులను ఆదేశించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి. గాజాకు అధికారులు విద్యుత్ నిలిపివేస్తారని అన్నారు. అలాగే ఆహారం, ఇంధనాల సరఫరాను అడ్డుకుంటారని చెప్పారు.

Hamas Attack On Israel
ఇజ్రాయెల్​పై హమాస్ ఉగ్రదాడి

ప్రాణాలు కోల్పోయిన థాయిలాండ్ వాసులు..
మరోవైపు.. ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడిలో తమ దేశానికి చెందిన 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మరో 11 మంది థాయ్‌ పౌరులు హమాస్‌ బందీలుగా ఉన్నారు. మరో ఎనిమిది మంది పౌరులు గాయపడి చికిత్స పొందుతున్నారని థాయ్‌ ప్రతినిధి వెల్లడించారు. మొత్తం 30 వేల మంది థాయ్‌ కార్మికులు ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి మంది తమను కాపాడాలంటూ కోరినట్లు థాయ్​లాండ్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాయల్‌ థాయ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అక్కడికి విమానాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Hamas Attack On Israel
ఇజ్రాయెల్​పై హమాస్ ఉగ్రవాదుల దాడి

హమాస్‌ ముష్కరులు జరిపిన దాడిలో 10 మంది నేపాలీలు ప్రాణాలు కోల్పోయారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని నేపాల్‌ విదేశాంగ శాఖ తెలిపింది. గాజా సరిహద్దుల్లోని కిబిడ్జు అలుమిమ్‌ ఫామ్‌లో మొత్తం 17 మంది నేపాలీలు పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు సురక్షితంగా తప్పించుకోగా నలుగురు గాయపడ్డారు. ఒకరి ఆచూకీ తెలియడం లేదు. హమాస్‌ దాడిలో చనిపోయిన నేపాలీలు అందరూ విద్యార్థులే. దాదాపు 5 వేల మంది నేపాలీలు ఇజ్రాయెల్‌లో ఉన్నారు .

Hamas Attack On Israel
హమాస్ దాడిలో ధ్వంసమైన భవనం

హమాస్‌ జరిపిన దాడిలో ఏడుగురు అమెరికన్ల జాడ గల్లంతైంది. ఇప్పటికే నలుగురు అమెరికన్లు మరణించగా ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ బాధితుల్లో అమెరికన్లు ఉన్న విషయాన్ని ధ్రువీకరించారు. హమాస్‌ బందీలుగా చేసుకున్న వారిలో మెక్సికన్లు, బ్రెజిల్‌ వాసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మెక్సికో మహిళ బందీగా ఉన్నట్లు తెలుస్తోంది. కెనడా వాసి ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు బందీలుగా ఉన్నారు. ఒక ఫ్రెంచి మహిళ చనిపోయినట్లు ఆ దేశ విదేశాంగశాఖ పేర్కొంది. ఇద్దరు బెలారస్‌ వాసులు ఈ దాడుల్లో గాయపడ్డారు.

Hamas Attack On Israel
హమాస్ దాడిలో ధ్వంసమైన భవనం

Israel Hamas War : భీకర యుద్ధం.. 1100మందికిపైగా మృతి.. చిక్కుకున్న 18వేల మంది భారతీయులు!

Iron Dome Israel : ఇజ్రాయెల్​కు 12ఏళ్లుగా 'ఐరన్​ డోమ్' రక్షణ.. లేకుంటే ఊహించని స్థాయిలో నష్టం!

Israel Vs Palestine : 'బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడిపాం'.. భీకర యుద్ధంలో 500 మంది మృతి!.. హమాస్​కు ఇజ్రాయెల్ ప్రధాని మాస్​ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.