Hamas Air Force Head Died : గాజాలోని హమాస్ నెట్‌వర్క్‌పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ ఏరియల్ ఆపరేషన్లు నిర్వహించే విభాగం హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఈ ఘటనలో హమాస్ ఏరియల్ ఫోర్స్ హెడ్ అబు మురద్ మృతి చెందాడని ఐడీఎఫ్ చెప్పినట్లు ఇజ్రాయెల్ పత్రిక వెల్లడించింది. శుక్రవారం రాత్రంతా హమాస్ కమాండో దళాలకు చెందిన పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే, అతడి మృతిని హమాస్ ఇంకా ధ్రువీకరించలేదు.
-
#WATCH | Latest visuals from Gaza border. Continuous tank shelling seen. pic.twitter.com/S2xZhtcfkm
— ANI (@ANI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Latest visuals from Gaza border. Continuous tank shelling seen. pic.twitter.com/S2xZhtcfkm
— ANI (@ANI) October 14, 2023#WATCH | Latest visuals from Gaza border. Continuous tank shelling seen. pic.twitter.com/S2xZhtcfkm
— ANI (@ANI) October 14, 2023
పాలస్తీనీయన్ల కోసం కారిడార్లు..
Israel Ground Attack On Gaza : మరోవైపు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైన ఇజ్రాయెల్.. ఉత్తర గాజాలోని పాలస్తీనా పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రాణభయంతో పాలస్తీనీయులు వలస బాట పట్టారు. అయితే, ఇజ్రాయెల్ నిరంతర వైమానిక దాడులతో వీరు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే వీరి కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరలింపు కారిడార్లను అందుబాటులో ఉంచినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఆ గడువులో ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచించింది.
-
#WATCH | View of Gaza from Israel's Sderot amid the Israeli–Hamas conflict.
— ANI (@ANI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video Source: Reuters) pic.twitter.com/sXDvyTvBVs
">#WATCH | View of Gaza from Israel's Sderot amid the Israeli–Hamas conflict.
— ANI (@ANI) October 14, 2023
(Video Source: Reuters) pic.twitter.com/sXDvyTvBVs#WATCH | View of Gaza from Israel's Sderot amid the Israeli–Hamas conflict.
— ANI (@ANI) October 14, 2023
(Video Source: Reuters) pic.twitter.com/sXDvyTvBVs
సౌదీ కీలక నిర్ణయం
Israel Saudi Arabia Deal : ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అరబ్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్ పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని.. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్లు సమాచారం.
అక్టోబరు 18వ తేదీ వరకు..
Israel To India Flight Air India : హమాస్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు అక్టోబరు 18వ తేదీ వరకు షెడ్యూల్ చేసిన విమానాలను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ప్రకటించింది. అక్టోబరు 14వరకు తొలుత విమానాలను నిలిపివేసిన ఎయిర్ఇండియా.. తాజాగా ఆ రద్దును అక్టోబర్ 18 వరకు పొడిగించింది. అయితే, అవసరాన్ని బట్టి ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఛార్టెర్డ్ విమానాలను నడుపుతుందని ఎయిర్ఇండియా అధికారి తెలిపారు. సాధారణంగా దిల్లీ -టెల్ అవీవ్ మధ్య సోమ, మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఎయిర్ఇండియా విమానాలు నడుపుతోంది.
Israel Enters Gaza : గాజాలోకి ఇజ్రాయెల్ బలగాలు ఎంట్రీ.. హమాస్‌ను నాశనం చేస్తామని ప్రధాని ప్రతిజ్ఞ