America Green Card : అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని అందించే గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ప్రవాసభారతీయులకు మార్గం సుగుమమైంది. 1992 నుంచి కుటుంబం,ఉద్యోగాల విభాగం కింద జారీ చేసిన 2లక్షల 30వేలకుపైగా.. ఉపయోగించని గ్రీన్ కార్డ్‌లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. ఈ మేరకు సిఫార్సును అమెరికా అధ్యక్ష సలహా సంఘం ఆమోదించింది.తాజా నిర్ణయంతో గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వేలాది మంది ప్రవాసభారతీయులకు ప్రయోజనం చేకూరనుంది.
గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వేలాది మంది ప్రవాసభారతీయులకు త్వరలోనే శుభవార్త అందనుంది. 1992 నుంచి కుటుంబం, ఉద్యోగ కారణాల కింద జారీ చేసిన 2లక్షల 30వేలకుపైగా.. ఉపయోగించని గ్రీన్ కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అమెరికా నిర్ణయించింది. తాజాగా ఈ సిఫార్సును అమెరికా అధ్యక్ష సలహా సంఘం ఆమోదించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రవాస భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వం లభించనుంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల విభాగంలో ఏటా జారీ చేసే లక్షా 40వేల గ్రీన్‌కార్డులతో పాటు తిరిగి స్వాధీనం చేసుకోనున్న 2లక్షల 30వేల గ్రీన్‌కార్డులు నుంచి కొంత భాగం జారీ చేయాలని బైడెన్ సలహా కమిషన్ సభ్యుడు అజయ్ భూటోరియా సిఫార్సు చేశారు.
ఉపయోగించని గ్రీన్ కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని.. భవిష్యత్తులో గ్రీన్ కార్డుల నిరుపయోగాన్ని అరికట్టాలని సిఫార్సులో అజయ్ భూటోరియా సూచించారు. గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో దౌత్యపరమైన జాప్యాలను పరిష్కరించి.. వేచి ఉన్న వ్యక్తులకు ఉపశమనం కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఉపయోగించని గ్రీన్ కార్డుల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని తన సిఫార్సు స్పష్టం చేస్తుందని భూటోరియా పేర్కొన్నారు.
ఉపయోగించని గ్రీన్ కార్డ్‌లను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల నష్టాన్ని నివారించవచ్చని అజయ్ భూటోరియా అన్నారు. గత రెండు దశాబ్దాలుగా కుటుంబ-ప్రాయోజిత గ్రీన్ కార్డ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య 100 శాతానికి పైగా పెరిగినట్లు కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తెలిపింది.ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం దాదాపు 12లక్షల మంది సగటున ఆరేళ్లుగా వేచి ఉన్నట్లు వెల్లడించింది. భారతీయ ఐటీ నిపుణులు సగటున దశాబ్ద కాలం కంటే ఎక్కువ నుంచి గ్రీన్ కార్డులు అందుకోలేదని వివరించింది.
ఇవీ చదవండి:
రష్యాలోనే ప్రిగోజిన్.. 'వాగ్నర్' గ్రూప్ చీఫ్ ఇంటిపై దాడులు.. భారీగా బంగారం స్వాధీనం!
అమెరికా డ్రోన్లపై నిప్పులు కురిపించిన రష్యా జెట్లు.. 24 గంటల్లో రెండో సారి..