World Condom Market Increased: ప్రపంచవ్యాప్తంగా కండోమ్ వినియోగం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు తెలుపుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా అంతర్జాతీయంగా కండోమ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. 2025 నాటికి అంతర్జాతీయ కండోమ్ మార్కెట్ విలువ 3.70 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని టెక్‌నావియో అనే గ్లోబల్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ అంచనా వేసింది. వార్షిక వృద్ధిరేటు 8 శాతంగా ఉంటుందని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచే 44శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. చైనా, భారత్, జపాన్ కండోమ్ వ్యాపారానికి కీలక మార్కెట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ప్రజల్లో లైంగిక అంటువ్యాధుల పట్ల అవగాహన పెరగడమే కండోమ్ వాడకం పెరుగుదలకు కారణమని టెక్‌నావియో నివేదిక పేర్కొంది. లైంగిక అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటం మార్కెట్ విస్తరణకు కారణమని పేర్కొంది. ఇ-కామర్స్ వేదికలు అభివృద్ధి చెందుతుండటం కూడా కండోమ్ మార్కెట్ పెరుగుదలకు కారణమని అభిప్రాయపడింది. మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వేగవంతమైన సరఫరా, మాస్ కస్టమైజేషన్, పర్సనలైజేషన్ వంటి వ్యూహాలపై కండోమ్ తయారీ సంస్థలు దృష్టి సారించాలని సూచించింది. వినియోగదారులు గోప్యతతో షాపింగ్ చేయడం కోసం కండోమ్ ప్రొవైడర్లు ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించింది.
ఇవీ చదవండి: 21 వాహనాలు పరస్పరం ఢీ.. ఆరుగురు దుర్మరణం.. కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్