ETV Bharat / international

Giorgia Meloni Split With Partner : 'ఇక మా దారులు వేరు'.. ఇటలీ ప్రధాని 'విడాకుల' ప్రకటన

Giorgia Meloni Split With Partner : తన భాగస్వామి​తో విడిపోతున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రకటించారు. తమ దారులు వేరయ్యాయని.. విడిపోయే సమయం వచ్చినట్లు సోషల్​ మీడియా వేదిక ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

Giorgia Meloni Partner
Giorgia Meloni Partner
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 4:20 PM IST

Giorgia Meloni Split With Partner : ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా జియాంబ్రూనో​తో విడిపోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో ట్వీట్​ చేశారు. అందులో 'ఆండ్రియా జియాంబ్రూనో​తో నా ప్రయాణం పదేళ్లు సాగింది. కొంత కాలంగా మా దారులు వేరయ్యాయి. ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది. మేము కలిసి గడిపిన అద్భుతమైన సంవత్సరాలు, మేము ఎదుర్కొన్న ఇబ్బందులు, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన నా కుమార్తెను నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు' అని చెప్పారు.

  • La mia relazione con Andrea Giambruno, durata quasi dieci anni, finisce qui. Lo ringrazio per gli anni splendidi che abbiamo trascorso insieme, per le difficoltà che abbiamo attraversato, e per avermi regalato la cosa più importante della mia vita, che è nostra figlia Ginevra.… pic.twitter.com/1IpvfN8MgA

    — Giorgia Meloni (@GiorgiaMeloni) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Giorgia Meloni Daughter : మెలోని-జియాంబ్రూనో వివాహం చేసుకోలేదు. కానీ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ ఏడేళ్ల కుమార్తె ఉంది. జియాంబ్రూనో.. ఇటాలియన్ టీవీ ఛానల్​ 'Rete 4a' ప్రసారమయ్యే "డయారియో డెల్ గియోర్నో" షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మహిళలు ఎక్కువగా మద్యం తాగకపోతే అత్యాచారాల బారి నుంచి తప్పించుకోవచ్చంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలా అనడం అప్పట్లో వివాదాస్పదమైంది. అప్పుడే ఈ ఘటనపై స్పందించిన మెలోని.. తన భాగస్వామి చేసిన వ్యాఖ్యలతో తనకు ఆపాదించరాదని అన్నారు. భవిష్యత్తులో ఆయనకు సంబంధించిన ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వబోనని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన తర్వాతే మెలోని తన భాగస్వామితో విడిపోతున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Giorgia Meloni Age : జార్జియా మెలోని 1977లో రోమ్​లో జన్మించారు. 15 ఏళ్ల వయసులో ఇటాలియన్ సోషల్​ మూమెంట్​లో చేరారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన మెలోని.. ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ వారంలో ఆమె ప్రభుత్వం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. ఇక జియాంబ్రూనో 1981లో జన్మించారు.

'నాకు ఆ హక్కు ఉంది'
గతేడాది ఇండోనేసియా వేదికగా జరిగిన జీ-20 సదస్సు సదస్సుకు కూమార్తెతో కలిసి హాజరు కావడంపై జార్జియా మెలోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై మెలోని కూడా ఘాటుగా స్పందించారు. 'నన్ను విమర్శిస్తున్న వారికి ఒకటే ప్రశ్న. నేను నా కుమార్తెను ఎలా పెంచాలనేది మీకు సంబంధించిన విషయమని అనుకుంటున్నారా? కానే కాదు. తల్లిగా బాధ్యతల విషయంలో నాకు నచ్చినట్లుగా వ్యవహరించే హక్కు ఉంది' అని కుండబద్దలు కొట్టారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కుమార్తెతో జీ-20కి వచ్చిన ఇటలీ ప్రధాని.. స్వదేశంలో వెల్లువెత్తుతున్న విమర్శలు

గర్ల్​ఫ్రెండ్​కు రూ.900కోట్ల ఆస్తి రాసిచ్చిన మాజీ ప్రధాని.. పెళ్లి కాకున్నా 'భార్య'గానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.