ETV Bharat / international

హమాస్​ కీలక కమాండర్​ మృతి- కాల్పుల విరమణ ఉండగానే దాడులు, 8 మంది పాలస్తీనీయన్లు మృతి

Hamas Commander Killed : ఇజ్రాయెల్‌తో యుద్ధంలో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. తమ సీనియర్‌ కమాండర్లలో ఒకరు, ఉత్తర గాజా ఇన్‌ఛార్జి అహ్మద్‌ అల్‌-ఘాందౌర్‌ మృతి చెందినట్లు హమాస్‌ ప్రకటించింది. మృతిచెందిన హమాస్‌ మిలిటెంట్లలో అతడే కీలకమైన వ్యక్తి అని అంతర్జాతీయ వార్తాసంస్థలు తెలిపాయి.

Israel Gaza Incharge Ahmad Ale Gounder Death

author img

By PTI

Published : Nov 26, 2023, 9:54 PM IST

Updated : Nov 26, 2023, 10:12 PM IST

Hamas Commander Killed : ఇజ్రాయెల్ దాడుల్లో ఉత్తర గాజా ఇన్‌ఛార్జి అహ్మద్‌ అల్‌ ఘాందౌర్‌ మృతి చెందినట్లు హమాస్‌ ప్రకటించింది. అయితే ఎప్పుడు, ఎక్కడ మరణించాడనేది మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. మరో ముగ్గురు మిలిటరీ నేతలూ చనిపోయినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో సాగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు మృతిచెందిన హమాస్‌ సభ్యుల్లో అహ్మద్‌ కీలకమైన వ్యక్తి అని అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. ఇతడు ఉత్తర గాజాకు బ్రిగేడ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని.. గతంలోనూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల నుంచి మూడు సార్లు తప్పించుకున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. 2017లో అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి, ఆర్థిక ఆంక్షలూ విధించింది. అంతకుముందు నిరిమ్‌ మారణకాండకు బాధ్యుడైన బిలాల్‌ అల్‌ కేద్రా, హమాస్‌ ఏరియల్‌ ఫోర్స్‌ హెడ్‌ అబు మురద్‌.. నక్బా యూనిట్‌ కమాండర్లు అహ్మద్‌ మౌసా, అమర్‌ అల్హంది ఉగ్రవాదులను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది.

వెస్ట్‌బ్యాంక్‌లో 8 మంది పాలస్తీనీయన్ల మృతి
Israel Hamas Ceasefire : అటు ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉండగా.. వెస్ట్‌బ్యాంక్‌లో మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఎనిమిది మంది పాలస్తీయన్లను ఇజ్రాయెల్‌ దళాలు కాల్చి చంపాయని పాలస్తీనా ఆరోగ్యశాఖ తెలిపింది. జెనిన్‌ శరణార్థి శిబిరంలో ఐదుగురు మృతి చెందగా.. సెంట్రల్‌ వెస్ట్‌బ్యాంక్‌లో ఒకరు, ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. దీనిపై ఇజ్రాయెల్‌ దళాలు సైతం ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్‌కు చెందిన తండ్రీకొడుకులను కారుతో గుద్ది చంపిన కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా... అక్కడి వారు తమపై దాడి చేశారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీంతో కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఘటనలో మరణించిన వారంతా ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్​ తెలిపింది.

మూడో విడతలో 17 మంది బందీల విడుదల
మరోవైపు ఆదివారం 17 మంది బందీలను విడుదల చేసింది హమాస్​. ఇ14 మంది ఇజ్రాయెల్​ పౌరులతో పాటు ముగ్గురు విదేశీయులను బందీ నుంచి విముక్తి చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కింద ఇప్పటికే రెండు దశలగా బందీలను విడుదల చేసిన హమాస్​.. మూడో విడత బందీలను తాజాగా ఇజ్రాయెల్​కు అప్పగించింది.

ముంబయి ఉగ్రదాడికి 15ఏళ్లు- లష్కరే తోయిబాపై ఇజ్రాయెల్​ బ్యాన్

ఇజ్రాయెల్,​ హమాస్​ కాల్పుల విరమణ- బందీల విడుదల షురూ, సంతోషంగా ఉందన్న నెతన్యాహు

Last Updated : Nov 26, 2023, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.