ETV Bharat / international

Gaza Crisis 2023 : గాజా ప్రజల కన్నీటి కష్టాలు.. ఆహారం కోసం పాట్లు.. 'అది వాళ్లకు ఉరిశిక్షతో సమానం' - ఇజ్రాయెల్​ గాజా యుద్ధం

Gaza Crisis 2023 : ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ హెచ్చరించడం వల్ల అక్కడి ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు! ఆహారం, తాగు నీటి కోసం అలమటిస్తున్నారు. కొందరు తమ ప్రాంతాన్ని వదిలి వెళ్తుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో తలదాచుకుంటున్నారు. మరోవైవు, ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ జరిపిన​ దాడుల్లో 2,329 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 3:58 PM IST

Gaza Crisis 2023 : ఉత్తర గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో అక్కడి ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఆహారం, తాగు నీటి కోసం అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్​ ఆదేశాలతో కొందరు ఉత్తర గాజాను వదిలి వెళ్తుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో తలదాచుకుంటున్నారు. దక్షిణ గాజా వైపు పాలస్తీనియన్లు ప్రత్యేక కారిడార్ల ద్వారా త్వరగా వెళ్లిపోవాలని మరోసారి హెచ్చరించింది ఇజ్రాయెల్​.

'వారిపై ఎలాంటి దాడి చేయం'
Israel Gaza War 2023 : ఇప్పటికే లక్షలాది మంది ఉత్తర గాజా నుంచి వెళ్లిపోగా.. మిగిలిన వారి కోసం ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తరలి వెళ్లేందుకు ఇచ్చిన గడువును మరో 3 గంటలు పెంచింది. తాము నిర్దేశించిన సేఫ్టీ కారిడార్‌లో తరలి వెళ్లాలని ఎక్స్ (ట్విట్టర్​) వేదికగా పేర్కొంది. ఆ మార్గంలో వెళ్తే ఎటువంటి దాడులు చేయమని స్పష్టం చేసింది. ఇళ్లను వీడి వెళ్లద్దని హమాస్‌ సూచించినా.. ప్రాణ భయంతో ప్రజలు ఉత్తర ప్రాంతాన్ని వీడుతున్నారు.

Gaza Crisis 2023
గుర్రపు బండిపై వెళ్తున్న ఉత్తర గాజా ప్రజలు
Gaza Crisis 2023
దక్షిణ గాజా వైపు వెళ్తున్న పాలస్తీనియన్లు

ఆకలితో చిన్నపిల్లలు అలమటిస్తూ..
Israel Gaza War News : మరోవైపు, గాజాలో ఇప్పటికే మానవతా సంక్షోభం తలెత్తింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్​ నిలిపివేయడం వల్ల గాజాలోని ఏకైక విద్యుత్​ ప్లాంట్​ మూతపడింది. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారంలోనే ఉంది. ప్రాణ భయంతో వ్యాపారులు బేకరీలను మూసివేయడం వల్ల కనీసం రొట్టెలు కూడా కొనలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Gaza Crisis 2023
తరలివెళ్తున్న ఉత్తర గాజా ప్రజలు

మానవతా సంక్షోభ నివారణకు అమెరికా ముమ్మర యత్నాలు!
Israeal Gaza War America : గాజాలో మానవతా సంక్షోభం తలెత్తిన వేళ.. దాని నివారణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పాలస్తీనా అద్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. గాజాకు మానవతా సాయాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. సామాన్య పౌరులను రక్షించే చర్యలకు పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చారు.

Gaza Crisis 2023
గాజాపై ఇజ్రాయెల్​ దాడి దృశ్యాలు

అటు.. అమాయక పాలస్తీనా ప్రజలను హమాస్.. మానవ కవచాలుగా ఉపయోగించుకుంటోందని బైడెన్‌ అన్నారు. చాలామంది పాలస్తీనా ప్రజలకు.. హమాస్‌తో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. హమాస్‌ మిలిటెంట్లు స్థానికులు ఉత్తరగాజా ప్రజలు తరలిపోకుండా రహదారులను మూసివేస్తున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్‌లో గల్లంతైన అమెరికా పౌరుల కుటుంబీకులతో అంతకుముందు మాట్లాడానని చెప్పిన బైడెన్‌.. వారి మనోవేదన తనకు అర్థమైందన్నారు. తన కుమార్తె, కుమారుడు చనిపోయినప్పుడు తానూ ఆ బాధను అనుభవించానని గుర్తు చేసుకున్నారు.

Gaza Crisis 2023
ధ్వంసమైన గాజా భవనాలు

2,329 మంది పాలస్తీనియన్లు మృతి
Palestinians Killed By Israel : ఇజ్రాయెల్​ దాడుల్లో ఇప్పటి వరకు 2,329 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది వరకు జరిగిన ఐదు యుద్ధాల్లో ప్రస్తుతం జరుగుతున్న సమరమే అత్యంత ఘోరమైనదిగా వర్ణించారు. 2014లో జరిగిన యుద్ధంలో 2,251 మంది మృతిచెందగా.. అంతకుముందు సారి 74 మంది చనిపోయినట్లు తెలిపింది.

'అది వాళ్లకు ఉరిశిక్షతో సమానం'
WHO On Gaza : గాజాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చెసింది. గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికల్ని తీవ్రంగా ఖండించింది. "రోగులు, వైద్య సిబ్బందిని బలవంతంగా తరలించడం.. మానవత్వాన్ని, ప్రజారోగ్య వ్యవస్థను మరింత దిగజార్చుతుంది. ఇప్పటికే దక్షిణా గాజా ఆస్పత్రులు రోగులతో నిండి ఉన్నాయి. ఇప్పుడు మరో 2 వేల మందిని అక్కడికి తరలిస్తే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. అది వాళ్లకు ఉరిశిక్షతో సమానం. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లు, లైఫ్‌ సపోర్ట్‌, డయాలసిస్‌ అవసరమయ్యే వాళ్లు, ఆరోగ్య సమస్యలున్న గర్భిణీలకు చికిత్స ఆలస్యమై ప్రాణాల మీదకొస్తుంది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తర గాజాలో ఉన్న రోగులను అక్కడే వదిలేసి వెళ్లలేక, తరలించి వారి ప్రాణాలను ప్రమాదంలో నెట్టలేక వైద్య సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారని పేర్కొంది.

Gaza Crisis 2023
ధ్వంసమైన గాజా భవనాలు

హమాస్‌ మరో కీలక కమాండర్‌ మృతి
Hamas Commander Killed : తమ దేశంలో ఇటీవల జరిగిన మారణకాండకు బాధ్యుడైన హమాస్‌ కీలక కమాండర్‌ బిలాల్‌ అల్‌ కేద్రాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్‌ వాయుసేన తాజాగా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా విడుదల చేసింది. హమాస్‌ మిలిటరీ విభాగంలోని నావికాదళ కమాండో యూనిట్​కు అతడు కమాండర్‌గా ఉన్నట్లు వెల్లడించింది. గాజాలోని దక్షిణ ఖాన్‌ యూనిస్‌లో బిలాల్‌ ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు గుర్తించాయి. వారు అందించిన సమాచారం ఆధారంగా వైమానిక దళాలు జరిపిన దాడిలో.. బిలాల్‌తోపాటు పలువురు హమాస్‌, జిహాద్‌ ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ వాయుసేన తెలిపింది

Gaza Crisis 2023
ఇజ్రాయెల్​ దాడిలో ధ్వంసమైన ఇల్లు

గ్రౌండ్​ ఆపరేషన్​కు ఇజ్రాయెల్​ రెడీ
Israel Ground Invasion Started : గాజాపై దాడులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. వాయు, నౌకా, సైనిక దళాలు సిద్ధమయ్యాయని తెలిపింది. విస్తృత దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. మూడు దళాలు సమన్వయంతో ఈ దాడులు చేస్తాయని ప్రకటించింది. పలు బెటాలియన్లను, బలగాలను మోహరించినట్లు.. యుద్ధం కోసం ఇజ్రాయెల్‌ అంతటినీ సర్వసన్నద్ధం చేసినట్లు వెల్లడించింది. యుద్ధంలో తదుపరి దశలకూ ప్రణాళికలు రూపొందించినట్లు.. ప్రత్యేకంగా అతి పెద్ద భూతల దాడులకు సిద్ధమయినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

Israel Hamas War Latest : హమాస్ పక్కా ప్లాన్.. ఇజ్రాయెల్​పై దాడికి ముందు గట్టి ప్రాక్టీస్.. కాగితపు బొమ్మలను కాలుస్తూ..

Hezbollah Israel Conflict : ఇజ్రాయెల్‌కు 'హిజ్బుల్లా' సవాల్‌.. లక్షకు పైగా రాకెట్లతో!

Hamas Targets : హమాస్‌ 'టాప్​ సీక్రెట్స్'​ లీక్​.. చిన్న పిల్లల స్కూళ్లే ఫస్ట్​ టార్గెట్​.. బందీలను చేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.