ETV Bharat / international

మెక్రాన్​కే మరోసారి ఫ్రాన్స్​ అధ్యక్ష పీఠం - ఫ్రాన్స్ న్యూస్​ లేటెస్ట్​

Emmanuel Macron: ఫ్రాన్స్‌ అధ్యక్ష పీఠం మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌నే వరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న వేళ మెక్రాన్‌ రెండోసారి ఎన్నికవడం కీలకంగా మారింది. మెక్రాన్​ విజయంపై పలువురు ప్రముఖులు అభినందులు తెలిపారు.

మెక్రాన్​
మెక్రాన్​
author img

By

Published : Apr 25, 2022, 5:06 AM IST

Updated : Apr 25, 2022, 10:54 AM IST

Emmanuel Macron: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. మెక్రాన్ వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అధికారిక ఫలితాలు వెలువడక ముందే ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌ ఓటమిని అంగీకరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న వేళ మెక్రాన్‌ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్‌లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చింది.

రెండోసారి విజయం సాధించిన మెక్రాన్‌కు పలువురు అభినందనలు తెలిపారు. మెక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు డచ్ ప్రధాని ట్వీట్ చేశారు. మెక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్‌, యూరోపియన్ జెండాలను ఊపారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్‌ లీపై గెలిచి 39 ఏళ్ల మెక్రాన్‌... ఫ్రాన్స్‌లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.

మోదీ శుభాకాంక్షలు: ఫ్రాన్స్​ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన మెక్రాన్​కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇండో-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మెక్రాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్‌ లీపై గెలిచి 39 ఏళ్ల మెక్రాన్‌... ఫ్రాన్స్‌లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.

ఇదీ చూడండి : 'ఆంక్షల దాడిని' రష్యా ఎలా ఎదుర్కొంటోంది?

Last Updated : Apr 25, 2022, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.