ETV Bharat / international

పునరావాస కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం, 32 మంది మృతి - పాకిస్థాన్​లో పేలుడు

Fire Accident In Iran Today
Fire Accident In Iran Today
author img

By PTI

Published : Nov 3, 2023, 1:11 PM IST

Updated : Nov 3, 2023, 4:52 PM IST

13:03 November 03

పునరావాస కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం, 32 మంది మృతి

Fire Accident In Iran Today : ఉత్తర ఇరాన్​లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇరాన్​ రాజధాని టెహ్రాన్​కు వాయవ్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్​రోడ్​ నగరంలోని ఓ ప్రైవేటు మాదకద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు.

పాకిస్థాన్​లో పేలుడు.. ఐదుగురు మృతి
Explosion In Pakistan Khyber Pakhtunkhwa : పాకిస్థాన్ ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శుక్రవారం పేలుడు సంభవించింది. పొండా బజార్ ప్రాంతంలోని ట్యాంక్​ అడ్డా సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, కేబీ బాంబ్​ డిస్పోజల్​ యూనిట్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన ప్రాంతం సమీపంలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవరస స్థితి ప్రకటించారు. అయితే దుండగులు ఓ మోటార్​ బైక్​లో పేలుడు పరికరాన్ని అమర్చారని తెలుస్తోంది. దీంతోపాటు ఘటన స్థలంలో తుపాకుల కాల్పుల శబ్దాలు కూడా వినిపించినట్లు సమాచారం.

ఆత్మాహుతి దాడి.. 55 మంది దుర్మరణం
Suicide Blast In Pakistan : ఇటీవల పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ రాష్ట్రంలో ఆత్మాహుతి దాడి జరిగింది. మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద మహ్మద్ ప్రవక్త జయంతి రోజు జరిగిన ఈ దాడిలో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్​పీ నవాజ్​ గాష్కోరి కూడా మృతి చెందారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Somalia Bomb Attack : ఇటీవల సోమాలియాలో బాంబుల వాహనం విధ్వంసం సృష్టించింది. సెంట్రల్ సోమాలియాలోని ఓ మాంసం దుకాణం వద్దకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో 14 మంది గాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపేందుకు ప్రయత్నించిన ముగ్గురు సైనికులను దుండగులు కాల్చిచంపారు. మార్కెట్​కు సమీపంలోని ఆర్మీ కమాండర్ ఇంటిని లక్ష్యంగా చేసుకునే.. ఈ దాడికి ప్రయత్నించారని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

పోలీస్​ స్టేషన్​పై అత్మాహుతి దాడి.. 12 మంది మృతి.. పాకిస్థానీ తాలిబన్ల పనే!

ఫుట్​బాల్ గ్రౌండ్​లో బాంబు పేలుడు.. 27 మంది మృతి.. చిన్నారులే ఎక్కువ!

Last Updated : Nov 3, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.