ETV Bharat / international

ఆస్పత్రిలో చెలరేగిన మంటలు.. 21 మంది మృతి

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దేశ రాజధాని బీజింగ్​లోని ఓ ఆస్పత్రి భవనంలో మంటలు చెలరేగి.. 21 మంది మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎమర్జెన్సీ​​ సిబ్బంది మరో 71 మందిని కాపాడారు. మరోవైపు, చైనా జెజియాంగ్​ ప్రావిన్సులోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.

fire accident in hospital in beijing
fire accident in hospital in beijing
author img

By

Published : Apr 18, 2023, 7:33 PM IST

Updated : Apr 18, 2023, 10:15 PM IST

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దేశ రాజధాని బీజింగ్​లోని చాంగ్​ఫెంగ్ ఆస్పత్రి భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ​​ సిబ్బంది.. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో ఉన్న 71 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
చైనా జెజియాంగ్​ ప్రావిన్సులోని జిన్హువా నగరం వుయి కౌంటీలోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 4 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
చెక్క తలుపులు, పెయింట్ లాంటివి తయారు చేసే ప్లాంట్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాధానికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నామని.. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

అగ్ని ప్రమాదంలో 31 మంది మృతి..
కొన్నాళ్ల క్రితం చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. జిలిన్ రాష్ట్ర రాజధాని చాంగ్​చున్​లోని ఓ రెస్టారెంట్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. న్యూ ఏరియా ఇండస్ట్రియల్ జోన్​లోని హైటెక్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జిలిన్ రాష్ట్ర రాజధాని అయిన చాంగ్​చున్.. వాహనాల తయారీ కేంద్రంగా ప్రసిద్ధి. ఇదే ప్రాంతంలో 2021లో అగ్ని ప్రమాదం సంభవంచి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జింగ్​యే హైటెక్​ ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ జోన్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 26 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఆయిల్​ ట్యాంకర్​ పేలి 18 మంది దుర్మరణం..
రెండు నెలల క్రితం చైనాలో ఆయిల్ ట్యాంకర్​ పేలిన ఘటనలో మృతుల 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 166 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని వెన్లింగ్ నగరం సమీపంలోని షెన్యాంగ్​-హైకో ఎక్స్​ప్రెస్ వేలో ఆయిల్ ట్యాంకర్​ పేలిపోయింది. దీంతో ప్రధాన రహదారిపై ఉన్న కార్లు, వాహనాలకు మంటలు అంటుకున్నాయి.

Last Updated : Apr 18, 2023, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.