Pakistan Internet Outage: పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సేవలకు శుక్రవారం అంతరాయం కలిగింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని టెలికాం అధికారులు తెలిపారు. అయితే వెంటనే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.
ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించామని అధికారులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్, లాహోర్ పట్టణాల్లో ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల బ్యాంక్‌లు, ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాకిస్థాన్‌లో 3జీ నెట్‌వర్క్‌లో 116 మిలియన్ల వినియోగదారులు, 4జీ నెట్‌వర్క్‌కు 119 మిలియన్ల వినియోగదారులు ఉన్నారని పాకిస్థాన్ టెలికాం అథారిటీ తెలిపింది.
ఇవీ చదవండి: భారత్‌తో శాంతి అంటూనే కశ్మీర్‌పై పాక్ ప్రధాని మెలిక
మరో వివాదంలో ఆ దేశ ప్రధాని, డ్రగ్స్ సేవించి డ్యాన్స్ చేశారంటూ