ETV Bharat / international

Eiffel Tower Bomb Threat : ఈఫిల్‌ టవర్‌కు బాంబు బెదిరింపు.. టూరిస్ట్​లకు ఎంట్రీ రద్దు! - ఈఫిల్ టవర్​ బాంబు బెదిరిపు వార్తలు

Eiffel Tower Bomb Threat : ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ను కూల్చివేసేందుకు బాంబు అమర్చామంటూ కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు.

Eiffel Tower Bomb Threat
Eiffel Tower Bomb Threat
author img

By

Published : Aug 12, 2023, 7:36 PM IST

Updated : Aug 12, 2023, 7:58 PM IST

Eiffel Tower Bomb Threat : ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ను కూల్చివేసేందుకు బాంబు అమర్చామంటూ కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా సందర్శకులందర్నీ అక్కడి నుంచి బయటకి పంపేశారు. పర్యటకులకు అనుమతి నిలిపివేసినట్లు ఫ్రెంచ్​ మీడియా తెలిపింది. పోలీసులు సహా బాంబు నిర్వీర్య బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ టవర్‌ను 1887 జనవరిలో మొదలుపెట్టి.. 1889 మార్చి 31వ తేదీనాటికి నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభ ఏడాదిలో 20 లక్షల మంది సందర్శకులు ఈఫిల్‌ టవర్‌ను సందర్శించారు. అయితే ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యటకులు వస్తుంటారు. గతేడాది 62 లక్షల మంది ఈ కట్టడాన్ని సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఫేమస్​ ఫైవ్​ స్టార్​ హోటల్​కు బాంబు బెదిరింపులు..
కొన్నిరోజుల క్రితం.. ముంబయిలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. హోటల్‌లో బాంబులు అమర్చామని, రూ.5 కోట్లు ఇవ్వకపోతే పేల్చేస్తామంటూ ఆగంతుకులు ఫోన్‌ చేశారు. అయితే అది నకిలీ బెదిరింపు కాల్‌ అని తేలడం వల్ల అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ముంబయిలోని ప్రముఖ లలిత్‌ హోటల్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి హోటల్‌లో నాలుగు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పారు. తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే హోటల్‌ను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎక్కడా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు కాల్‌గా ధ్రువీకరించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Aug 12, 2023, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.