ఈజిప్ట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. మిన్యా రాష్ట్రం మాలావి నగరంలో మంగళవారం ఉదయం జరిగిందీ ఘటన.
ఓ బస్సు.. మిన్యా రాష్ట్రం నుంచి రాజధాని కైరోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైర్లు మార్చేందుకు వైవేపై ఓ పక్కన నిలిపిన లారీని.. బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. బస్సు ముందు భాగమంతా తీవ్రంగా ధ్వంసమవగా.. అందులోని అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
ఈజిప్ట్‌లో తరచూ ఇదే తరహాలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరగుతుంటాయి. జనవరిలో రెండు బస్సులో ఢీకొన్న ఘటనలో 16 మంది చనిపోయారు. 18 మంది గాయపడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో హైవేపై లారీని ఓవర్టేక్ చేస్తూ బస్సు బోల్తా పడి.. 21 మంది మరణించారు. ముగ్గురు క్షతగాత్రులయ్యారు.