Donald trump news: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. న్యూయార్క్‌లోని అటార్నీ జనరల్ కార్యాలయానికి విచారణ నిమిత్తం బుధవారం హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ట్రంప్.. అటార్నీ జనరల్ కార్యాలయానికి చేరుకున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు స్థిరాస్తి వ్యాపారి అయిన ట్రంప్.. తన ఆస్తుల విలువను తప్పుగా చూపి ఆదాయపు పన్ను శాఖ అధికారులను, రుణ దాతలను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సుదీర్ఘకాలంగా దర్యాప్తు జరుగుతుండగా.. ఇప్పుడు ఆయన స్వయంగా విచారణకు హాజరు కావాల్సి వచ్చింది.
అధ్యక్ష పదవిని వీడే వేళ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాల్ని తీసుకెళ్లారన్న ఆరోపణలపై ఫ్లోరిడా పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగో నివాసంలో ఎఫ్‌బీఐ అధికారులు ఇటీవలే సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో మరో కేసులో ట్రంప్ స్వయంగా విచారణకు హాజరు కావడం చర్చనీయాంశమైంది.
ట్రంప్‌కు మరిన్ని చిక్కులు.. స్వయంగా విచారణకు హాజరైన మాజీ అధ్యక్షుడు - న్యూయార్క్‌లోని అటార్నీ జనరల్ కార్యాలయం
Donald trump news: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆస్తుల విలువను తప్పుగా చూపించి, పన్ను విభాగం అధికారుల్ని మోసగించారన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కొన్నారు.