International Booker Prize: ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీని ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ వరించింది. హిందీ నవల 'టూంబ్ ఆఫ్ సాండ్'కు గానూ గీతాంజలి శ్రీకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సొంతమైంది. ఫలితంగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్న తొలి భారతీయ రచయిత్రిగా గీతాంజలి శ్రీ నిలిచారు. గీతాంజిలి శ్రీ 2018లో రెట్ సమాధి పేరుతో హిందీలో నవల రాశారు. దీనిని అమెరికాకు చెందిన అనువాదకురాలు డైసీ రాక్‌వెల్ టూంబ్ ఆఫ్ సాండ్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు.
లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డైసీ రాక్‌వెల్‌తో కలిసి గీతాంజలి శ్రీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బుకర్ ప్రైజ్ కింద బహుమానంగా వచ్చే 50 వేల పౌండ్లను వీరిద్దరూ సమంగా పంచుకోనున్నారు. బుకర్ ప్రైజ్ వరించడం పట్ల గీతాంజలి శ్రీ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలోని ఒక కుటుంబ కథాంశంతో 'టూంబ్ ఆఫ్ సాండ్' అనే నవలను గీతాంజలిశ్రీ రచించారు.
ఇదీ చదవండి: శునకంలా మారిపోయిన జపాన్ వాసి.. లక్షలు ఖర్చు చేసి...