Congo Landslide : కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందిన ఘటన కాంగోలో జరిగింది. భారీ వర్షాల ధాటికి ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాలను కప్పేసాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్ పట్టణంలో.. కాంగో నది తీరప్రాంత పరిసరాల్లో ఈ ఘటన జరిగింది.
మూడు రోజులు సంతాప దినాలు..
ఘటనా స్థలంలో ముమ్మర సహాయక చర్యలు చేపట్టినట్లు మంగల గవర్నర్ సీజర్ లింబయా తెలిపారు. శిథిలాల్లో చిక్కుకుని క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లింబయా.. మంగల ప్రావిన్స్ అంతటా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు.
ముంచెత్తిన వరదలు.. 200 మందికి పైగా మృతి.. భారీగా ఆస్తి నష్టం..
2023 మేలోనూ కురిసిన భారీ వర్షాలు కాంగోను అతలాకుతలం చేశాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వానలకు నదులు పోటెత్తాయి. నదులు ఉప్పొంగి.. దక్షిణ కివు ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. వరద ధాటికి ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. ఆ సమయంలో వరద బీభత్సానికి 200 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. బురదలో చిక్కుకొన్న చాలా మృతదేహాలను వెలికి తీశారు సహాయక సిబ్బంది. ఈ వరదల్లో స్కూళ్లు, ఆసుపత్రులు, ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేస్తున్న సమయంలో సిబ్బందితో పాటు కొంతమంది అధికారులు కూడా గాయపడ్డారు. ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొండచరియలు విరిగిపడి 20 మంది సజీవ సమాధి..
ఈ ఏడాది ఏప్రిల్‌లో.. కాంగోలో కొండచరియలు విరిగిపడి 20 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మసీసీ ప్రాంతంలోని బొలోవా అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 25 మంది మహిళలు తమ పిల్లలతో కలిసి కొండ దిగువన ఉన్న ప్రవాహంలో బట్టలు ఉతుకుతున్న సమయంలో.. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఒకే కుటుంబంలో మూడు తరాలు బలి.. తమ్ముడిని కాపాడబోయి అన్న కూడా.. కొండచరియల వల్ల మొత్తం 60 మంది మృతి