ETV Bharat / international

అమెరికాలో చైనా రహస్య పోలీస్‌ స్టేషన్​.. ఇద్దరు అరెస్ట్​ - అమెరికాలో సీక్రెట్ పోలీస్ స్టేషన్ ఇద్దరు అరెస్ట్

చైనాకు చెందిన రహస్య పోలీస్‌ అవుట్‌ పోస్టును అమెరికాలో గుర్తించారు అధికారులు. న్యూయార్క్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించారు. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చైనీయులపై.. వేధింపులకు పాల్పడేందుకు చైనా ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసిందని వారు తెలిపారు.

chinese-secret-police-station-in-america-us-arrests-two-for-running-secret-chinese-police-station
అమెరికాలో చైనీస్ రహస్య పోలీస్ స్టేషన్
author img

By

Published : Apr 18, 2023, 2:06 PM IST

Updated : Apr 18, 2023, 2:36 PM IST

విదేశాల్లో ఉంటూ సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చైనీయులపై.. వేధింపులకు పాల్పడేందుకు చైనా ప్రభుత్వం వేర్వేరు దేశాల్లో రహస్య పోలీస్ స్టేషన్లు నడుపుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కెనడా, ఐర్లాండ్‌లో ఇలాంటి అక్రమ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని గతంలో అనేక వార్తలు వచ్చాయి. తాజాగా అమెరికాలో చైనా రహస్య పోలీస్‌ అవుట్‌ పోస్టును గుర్తించినట్లు.. అగ్రరాజ్యం ప్రకటించింది. న్యూయార్క్‌లో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు న్యాయవిభాగం పేర్కొంది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లోని ఒక భవనంలో చైనా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ పేరుతో.. ఒక కార్యాలయం ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశంపై ఎఫ్​బీఐ దర్యాప్తు చేస్తోందని తెలిసి.. ఆ కార్యాలయం మూసివేశారు. ఈ కార్యాలయం ఏర్పాటు చేసిన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన ఇద్దరిలో ఒకరిని 61ఏళ్ల హేరీ లు జియాన్‌వాంగ్​గా, మరొకరిని 59 ఏళ్ల చెన్‌ జిన్‌పింగ్​గా గుర్తించారు. బ్రాంక్స్‌, మన్‌హటన్‌లో వారి ఇళ్లలో ఉన్న.. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చైనా ప్రభుత్వంతో వారు జరిపిన సంభాషణల డేటాను తమ ఫోన్ల నుంచి వారు డిలీట్ చేసినట్లు ఎఫ్​బీఐ అధికారులు ఆరోపించారు. చైనా పౌరులు తమ డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్దరణ, కాలిఫోర్నియాలో చైనా ప్రభుత్వ వ్యతిరేకులను గుర్తించడం వంటి కార్యక్రమాలను.. ఈ పోలీస్ అవుట్ పోస్ట్ నిర్వహిస్తోందని గుర్తించారు.

chinese-secret-police-station-in-america-us-arrests-two-for-running-secret-chinese-police-station
అమెరికాలో చైనా రహస్య పోలీస్‌ స్టేషన్

అమెరికాలో ఉంటూ చైనా ప్రభుత్వ విధానాలను.. బహిరంగంగా విమర్శించేవారిని వేధించేందుకు జిన్‌పింగ్‌ సర్కార్‌ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా న్యాయ విభాగం కృషి చేస్తోంది. కొంతకాలంగా అలాంటి కేసులను ఒకే చోటుకు చేర్చుతోంది. అందులో భాగంగా చైనా విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజస్వామ్యవాదులను.. సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్న చైనా జాతీయ పోలీసులు 36 మందిపై కేసులు పెట్టినట్లు అమెరికా న్యాయ విభాగం వివరించింది.

అమెరికా, భారత్​ మిగతా దేశాలపై చైనా బెలూన్ల నిఘా..
కొద్దికాలం క్రితం.. అమెరికాలోని అణు స్థావరంపై చైనా వదిలిన ఓ భారీ హై ఆల్టిట్యూడ్‌ బెలూన్‌ను.. అధికారులు గుర్తించారు. అనంతరం దాన్ని కూల్చి వేశారు. ఈ బెలూన్‌ అమెరికాలోని చాలా కీలక ప్రదేశాల మీదుగా ఎగురిందని ఆ సమయంలో అధికారులు తెలిపారు. దీని ద్వారా పెద్దగా ఇంటెలిజెన్స్‌ సమాచారం లీక్‌ కాకపోవచ్చని.. అప్పట్లో అమెరికా అభిప్రాయపడింది.

చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్‌లోనూ అనేక సంవత్సరాలుగా పాక్షికంగా నిఘా బెలూన్ వ్యవస్థ పనిచేస్తోందని కొంత కాలం క్రితం వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌ సహా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక దేశాల సైనిక ఆస్తుల సమాచారాన్ని ఈ వ్యవస్థ సేకరించిందని పేర్కొంది. ఈ నివేదిక అనేక మార్గాలు, నిఘా అధికారుల ద్వారా సేకరించినట్లు వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళం ద్వారా నిర్వహిస్తున్న ఈ నిఘా ఎయిర్‌షిప్‌లు ఐదు ఖండాలలో కనిపించాయని అధికారులు తెలిపారు. భారత్​లోని అండమాన్, నికోబార్ దీవుల్లోని ఇలాంటి చైనా బెలూన్లు సంచరించాయి. దీనిపై భారత్​ అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంది.

Last Updated : Apr 18, 2023, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.