China Submarine Accident Yellow Sea : అణు శక్తితో పనిచేసే చైనా సబ్మెరైన్ '093-417' ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో జలాంతర్గామిలో ఉన్న 55 మంది సబ్మెరైన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఆగస్టులోనే జరిగినా.. చైనా ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఆధారంగా డైలీ మెయిల్ ఈ ప్రమాదంపై కథనాన్ని ప్రచురించింది.
China Submarine Crash : అమెరికా నేవీ వర్గాలు ఈ జలాంతర్గామి ప్రమాదం గురించి ఆగస్టులోనే సమాచారం వెల్లడించాయని డైలీ మెయిల్ తెలిపింది. ఈ ప్రచారాన్ని చైనా, తైవాన్ తోసిపుచ్చాయని పేర్కొంది. కానీ, ఈ ప్రమాద విషయాన్ని తాజాగా బ్రిటన్ సబ్మెరైనర్లు సైతం ధ్రువీకరించినట్లు డైలీ మెయిల్ కథనం స్పష్టం చేసింది. అమెరికా, బ్రిటన్ సబ్మెరైన్ల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చైనా జలాంతర్గామి చిక్కుకుందని పేర్కొంది. ఫలితంగా జలాంతర్గామి ఆక్సిజన్ సిస్టమ్లో తలెత్తాయని తెలిపింది.
'జలాంతర్గామిలోని 53 మంది జలసమాధి!'
"చైనా కాలమానం ప్రకారం ఉదయం 8.12 గంటలకు ఈ ఘటన జరిగింది. యెల్లో సీ గుండా ఈ సబ్మెరైన్ ప్రయాణించింది. బ్రిటిష్, అమెరికా సబ్మెరైన్ల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో ఈ జలాంతర్గామి చిక్కుకున్నట్లు అనిపిస్తోంది. అక్కడ అడ్డుగా ఉన్న చైన్లను సబ్మెరైన్ ఢీకొట్టింది. చైన్లలో ఇరుక్కుపోవడం వల్ల సబ్మెరైన్ బ్యాటరీలు పనిచేయలేదు. ఎయిర్ ప్యూరిఫయర్లు, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు విఫలమయ్యాయి. ఫలితంగా గాలి కలుషితమైంది. ప్రమాదంలో సబ్మెరైన్ కెప్టెన్ కర్నల్ షూ-యోంగ్-పెంగ్ సహా 26 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్లు, 9 మంది చిన్నస్థాయి అధికారులు, 17 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. తగినంత ఆక్సిజన్ లేకపోవడం/ గాలి కలుషితం కావడం వల్లే వీరంతా చనిపోయినట్లు భావిస్తున్నాం. ఈ ఘటనపై అంతర్జాతీయ సహకారాన్ని చైనా కోరలేదు. ఎందుకు కోరలేదో మనందరికీ తెలుసు' అని నిఘా వర్గాలను ఉటంకిస్తూ మీడియా సంస్థ నివేదించింది.
ప్రసంగం ఆపింది అందుకేనా?
ఈ ఘటన జరిగిన సమయంలో పశ్చిమ దేశాలకు చెందిన పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే, వీటిని చైనా ఖండించింది. అదే సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అప్పుడు ఆయన ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. జిన్‌పింగ్ మిగతా ప్రసంగాన్ని చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వాక్వింగ్.. సదస్సుకు చదివి వినిపించారు. ఈ జలాంతర్గామి ప్రమాద విషయం తెలియడం వల్లే.. జిన్‌పింగ్ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపారని భావిస్తున్నారు.
టైటాన్ విషాదం.. నాటి పైసీస్ అద్భుతం..! 12 నిమిషాల్లో ఆక్సీజన్ అయిపోనుండగా బయటపడ్డారు!!