చైనాకు చెందిన లూ పెంగ్ యువాన్ యు 028 (LU PENG YUAN YU 028) అనే ఫిషింగ్ నౌక హిందూ మహాసముద్రంలో గల్లంతయ్యింది. ఈ ఓడలో 39 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. గల్లంతైన షిప్‌ను కనుగొనేందుకు సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా తక్షణ సాయంగా P8I విమానాన్ని చైనాకు అందించింది భారత నౌకాదళం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ కోసం P8I విమాన బృందం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మునిగిపోయిన ఓడకు సంబంధించి అనేక వస్తువులను గుర్తించినట్లు ఇండియన్ నేవీ తెలిపింది. భారత్‌కు సుమారు 900 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ హిందూ మహాసముద్రం ప్రాంతంలో గుర్తించినట్లు డ్రాగన్ దేశానికి ఇండియన్ నేవీ సమాచారం అందించింది. గల్లంతైన సిబ్బందిలో చైనా సహా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం.
"హిందూ మహాసముద్రంలో చైనా ఓడకు భద్రతగా విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా భారతదేశం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. భారత నావికాదళం విభాగాలు ఆ ప్రాంతంలోని ఇతర సిబ్బంది సాయంతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను వేగవంతం చేసింది. చైనా నేవీకి చెందిన పలు యుద్ధనౌకలు కూడా ఘటనా స్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటాయి."
- భారత నౌకాదళం అధికారి
మయన్మార్‌కు తోడుగా.. ఆపరేషన్ కరుణ!
ఇటీవలె మయన్మార్ పశ్చిమ తీర ప్రాంతంలో భీకర మోచా తుపాను బీభత్సం సృష్టంచింది. భారీగా ముంచెత్తిన వరదల ధాటికి కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రకృతి ప్రకోపానికి సుమారు ఆరుగురు వ్యక్తులు మరణించారు. గంటకు 209 కి.మీ. వేగంతో వీచిన ప్రచండ గాలుల కారణంగా సుమారు 700 మందికిపైగా గాయపడ్డారు. 10 లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర జలాలు ముంచుకొచ్చాయి. రఖినే రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో నీరు సుమారు 5 అడుగుల వరకు నిలిచి ఉంది. రఖినే రాష్ట్రంలోని 17 టౌన్‌షిప్‌లు విపత్తులో చిక్కుకున్నాయని అధికారులు ప్రకటించారు. మయన్మార్‌కు అండగా నిలిచేందుకు భారత నౌకాదళం ఆపరేషన్ కరుణ పేరుతో సహాయాన్ని అందిస్తోంది. భారత్‌కు చెందిన శివాలిక్, కమోర్తా, సావిత్రి నౌకలు సహాయ సామగ్రితో మయన్మార్‌లోని యాంగాన్‌కు ఇప్పటికే చేరుకున్నాయి. కాగా, సహాయాన్ని అందించిన మొదటి నౌకాదళ ఓడలు ఇవే అని అధికారులు తెలిపారు.
-
Operation Karuna | Indian Naval Ships Shivalik, Kamorta and Savitri were the first Naval ships to arrive at Yangon, Myanmar with relief material.#CycloneMocha pic.twitter.com/uZ35vy1tHd
— ANI (@ANI) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Operation Karuna | Indian Naval Ships Shivalik, Kamorta and Savitri were the first Naval ships to arrive at Yangon, Myanmar with relief material.#CycloneMocha pic.twitter.com/uZ35vy1tHd
— ANI (@ANI) May 18, 2023Operation Karuna | Indian Naval Ships Shivalik, Kamorta and Savitri were the first Naval ships to arrive at Yangon, Myanmar with relief material.#CycloneMocha pic.twitter.com/uZ35vy1tHd
— ANI (@ANI) May 18, 2023