ETV Bharat / international

ఆ విమాన ప్రమాదంలో 132 మంది మృతి.. మరో బ్లాక్​ బాక్స్​ లభ్యం - చైనా విమాన ప్రమాదం వార్తలు

China Plane Crash: చైనా విమాన ప్రమాదంలో 132 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా ధ్రువీకరించింది. 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్​షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో సోమవారం కూలిపోయింది. మరోవైపు, ఈ విమానానికి సంబంధించిన రెండో బ్లాక్ బాక్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

China Plane Crash
China Plane Crash
author img

By

Published : Mar 27, 2022, 5:23 AM IST

Updated : Mar 27, 2022, 9:49 AM IST

China Plane Crash: ఇటీవల జరిగిన చైనా విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న 132 మంది మృతిచెందినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్​షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో సోమవారం కూలిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత.. అనేక గంటలు గాలింపు చేపట్టినా.. ఎలాంటి ఆశాజనక పరిస్థితులు కన్పించలేదు. ఈ ఘటనపై దర్యాప్తులో చైనా ఈస్టర్న్​ ఎయిర్​లైన్స్​కు పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ తెలిపింది.

మరోవైపు, ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. నాలుగు రోజుల క్రితమే కాక్​పిట్ వాయిస్ రికార్డర్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఫ్లైట్ డేటా రికార్డర్​ను సైతం గుర్తించారు. ఈ రెండింటి సాయంతో ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. వీటిని విశ్లేషించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటారు.

ఇదీ చూడండి: ఉక్రెయిన్​పై ఆగని దాడులు.. 16,400 మంది రష్యా సైనికులు మృతి!

Last Updated : Mar 27, 2022, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.