China Minister Removed : దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోయిన చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫూను జిన్‌పింగ్ సర్కార్ తొలగించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. షాంగ్‌ఫూ తొలగింపునకు జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. అయితే షాంగ్‌ఫూ ఉద్వాసనకు కారణమేంటన్నది మాత్రం చెప్పలేదు. ఆయన స్థానంలో కొత్తగా ఎవర్ని నియమించిందో కూడా వెల్లడించలేదు. షాంగ్‌ఫూతో పాటు ఆర్థిక మంత్రి లియు కున్ను తొలగించి.. ఆయన స్థానంలో లాన్ ఫోయాన్ను నియమించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్‌ను తొలగించి.. ఆయన స్థానంలో యిన్ హెజున్‌ను నియమించినట్లు అధికారికంగా తెలిపింది.
జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి..
China Defence Minister Missing : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామికవేత్తల నుంచి మంత్రుల వరకు చాలా మంది అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అప్పటి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ ఇలానే అదృశ్యమయ్యారు. అమెరికా మాజీ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ వచ్చినప్పుడు కూడా కిన్ గాంగ్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత కొన్ని రోజులకు ఆయనను తప్పించి.. విదేశాంగ శాఖ బాధ్యతలను అంతకుముందు నిర్వహించిన వాంగ్ యీకి అప్పగించారు.
ఆ సదస్సు తర్వాత మాయం
China Defence Minister Disappeared : ఆ తర్వాత చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫూ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. షాంగ్‌ఫూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహితుడన్న పేరు ఉంది. 2023 మార్చిలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు షాంగ్‌ఫూ. ఆగస్టు 29న అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న తర్వాత షాంగ్‌ఫూ కనిపించకుండా పోయారు.
ఆ కేసుల విచారణ జరుగుతున్న సమయంలోనే..
China Hardware Case : అయితే చెైనాలో హార్డ్‌వేర్ కొనుగోలుకు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుపుతున్న సమయంలోనే లీ షాంగ్‌ఫూ కనిపించకుండాపోయారు. ఈ కేసులపై 2017 నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు చైనా మిలిటరీ వెల్లడించింది. 2017 నుంచి 2022 మధ్య లీ షాంగ్‌ఫూ ఎక్విప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్యకలాపాలు చూశారు. ఆ సమయంలో ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా వినిపించలేదని తెలుస్తోంది.
Khalistan Nijjar Killed : 'నిజ్జర్ హత్యలో చైనా ఏజెంట్ల ప్రమేయం.. ఇండియన్ ఇంగ్లిష్ నేర్చుకొని మరీ..'
China Birth Rate 2023 : ప్రపంచంలోనే వృద్ధ దేశంగా చైనా!.. భారీగా తగ్గిన జననాలు.. డ్రాగన్ కలవరం