ETV Bharat / international

భారత్​పై చైనా మరో ఎత్తుగడ, పక్కలో బల్లెంలా కుట్రలు, ఉపగ్రహ డేటాపై కన్ను - హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా

India china news: భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా తాజాగా మరో ఎత్తుగడ వేసింది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకస్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది హిందూ మహాసముద్రంలో మోహరించిన తమ యుద్ధనౌకలకు సహాయకారిగా మారనుంది. 590 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన నౌక స్థావరంలో సైన్యాన్ని దించి భారత్‌కు పక్కలో బల్లెంలా మారాలని కుట్ర చేస్తోంది.

india china news
ఇండియా చైనా
author img

By

Published : Aug 18, 2022, 8:30 PM IST

India china news: భారత్‌ చుట్టుపక్కల సైనిక ఉనికిని పెంచుకుంటున్న చైనా.. తన కుయుక్తులను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన తొలి విదేశీ నౌక స్థావరానికి యుద్ధ నౌకలను తరలించింది. 2016లో 590 మిలియన్ డాలర్ల వ్యయంతో హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికాలో డ్రాగన్‌ తన తొలి విదేశీ నౌకా స్థావరం నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం అక్కడ యుద్ధనౌకను మోహరించింది. అందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు మీడియాకు అందాయి. హిందూ మహా సముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా డ్రాగన్‌ కుయుక్తులు పన్నుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాల్వ మార్గంలో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను వేరు చేసే వ్యూహాత్మక బాబ్-ఎల్-మాండెబ్ జలసంధిలో చైనా నౌకాస్థావరం ఉంది. దీన్ని ప్రత్యక్ష దాడిని తట్టుకునేలా నిర్మించినట్లు సమాచారం.

యుజావో యుద్ధ నౌకను మోహరించినట్లు మాక్సర్‌ ఉపగ్రహ ఛాయచిత్రాలు చాటుతున్నాయి. ఇది 25 వేల టన్నుల బరువు, 800మంది సైనిక సామర్థ్యం కలిగిన ఈ యుద్ధనౌకపై వాహనాలతోపాటు జెట్‌ ఫైటర్లను మోహరించవచ్చు. ఇది ట్యాంకులు, ట్రక్కులు, హోవర్ క్రాఫ్ట్‌లను మోయగలదు. ఇటీవలె శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవులో 25వేల టన్నుల యువాన్‌ వాంగ్‌ యుద్ధనౌకను మోహరించిన చైనా తొలి విదేశీ నౌకా స్థావరంలోనూ కార్యకలాపాలు ప్రారంభినట్లు తెలుస్తోంది.

ఈ యుద్ధనౌక ద్వారా భారత్‌కు సంబంధించిన కీలకమైన ఉపగ్రహ సమాచారాన్ని చైనా ట్రాక్‌ చేసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భారత్‌-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో డ్రాగన్‌ తన యుద్ధనౌకను మోహరించడం ద్వారా సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాద చొరబాట్ల గుర్తింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి భారత నిఘా వ్యవస్థలను డ్రాగన్‌ పర్యవేక్షించే ప్రమాదం ఉన్నట్లు రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.

శ్రీలంకలోని హంబన్‌ టోటా, జిబౌటిలో చైనా ఉనికి సుదీర్ఘ బెల్ట్‌, రోడ్‌ కార్యక్రమంలో భాగంగా ఆ రెండు దేశాల్లో ఆర్థిక పెట్టుబడులతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. జిబౌటి నౌక కేంద్రం నిర్మాణానికి తీసుకున్న రుణంలో చైనా మెజార్టీ వాటా కలిగి ఉంది. ఇది ఆఫ్రికా దేశం జీడీపీలో 70శాతానికిపైగా ఉంది. శ్రీలంకతో 99ఏళ్ల లీజు ఒప్పందం ద్వారా హంబన్‌టోటా పోర్టును చైనా స్వాధీనం చేసుకుంది. ఈ ఓడరేవు నిర్మాణం కోసం కొలంబో తీసుకున్న 170 కోట్ల డాలర్ల రుణానికి సంబంధించి ఏటా చెల్లించాల్సిన కోటి డాలర్ల మొత్తాన్ని చెల్లించకపోవటంతో ఈ ఒప్పందం చేసుకుంది. అయితే చైనా సముద్ర లక్ష్యాలు, సామర్థ్యాలను భారత్‌ తక్కువగా అంచనా వేయకూడదని నౌకాదళం మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు.

హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికాలో 14ఏళ్ల నుంచి చైనా గస్తీ స్థావరాన్ని నిర్వహిస్తోంది. అంతదూరంలో నౌకా స్థావరాన్ని కొనసాగించటంపై తొలుత అనుమానాలు నెలకొన్నప్పటికీ అది సాధ్యమని నిరూపితమైనట్లు అరుణ్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. అక్కడ 6 నుంచి 9 నెలలపాటు నౌకలను మోహరిస్తున్నట్లు తెలిపారు. సముద్రజలాల్లో చైనా తన ప్రభావాన్ని పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా విస్తరిస్తున్నట్లు మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ అరుణ్ ప్రకాశ్‌ తెలిపారు. హిందూ మహాసముద్రంలో అణుశక్తి కలిగిన యుద్ధనౌకలను మోహరించటంతోపాటు యుద్ధ వాహక బృందాలను చైనా ఏర్పాటు చేసినందున అప్రమత్తంగా ఉండాలని అమెరికా నౌక దళం కమాండర్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 10 మంది పిల్లల్ని కంటే నజరానా, మహిళలకు పుతిన్ బంపర్ ఆఫర్

మంకీపాక్స్ విజృంభణ,​ వ్యాక్సిన్​పై డబ్ల్యూహెచ్​ఓ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.