ETV Bharat / international

China Flood 2023 : చైనాను ముంచెత్తిన వరదలు.. 29 మంది మృతి.. భారీగా ఆస్తి నష్టం - severe floods in china

China Flood 2023 : చైనా హెబీ ప్రావిన్స్​ను వరదలు ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 29 మంది మృతిచెందారు. మరో 16 మంది గల్లంతయ్యారు. కాగా ఈ వరదలతో హెబీ ప్రావిన్స్​లో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిందని అక్కడి అధికారులు తెలిపారు.

China Flood 2023
చైనా వరదలు 2023
author img

By

Published : Aug 11, 2023, 4:11 PM IST

Updated : Aug 11, 2023, 5:16 PM IST

China Flood 2023 : చైనా హెబీ ప్రావిన్స్​లో సంభవించిన వరదల్లో 29 మంది మరణించగా.. మరో 16 మంది గల్లంతయ్యారు. ఈ వరదల వల్ల హెబీ ప్రావిన్స్​లో దాదాపు 95.81 బిలియన్​ యువాన్​ల భారీ నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహాయక సిబ్బందికి, వరదల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు అధికారులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. ఈ వరదలకు దారి తీశాయని హెబీ ప్రావిన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ గవర్నర్ జాంగ్ చెంగ్‌జోంగ్ తెలిపారు. అత్యవసర సహాయ నిధి కింద శుక్రవారం 1.46 బిలియన్ యువాన్లు కేటాయించినట్లు చైనా అర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ నిధులు హెబీ ప్రావిన్స్​తో సహా బీజింగ్, టియాంజిన్, జిలిన్ హీలాంగ్‌, జియాంగ్​కు వర్తిస్తాయి. కాగా ఈ వరద సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి.. కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయం కింద 7.738 బిలియన్​ యువాన్లు మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రావిన్స్​లో వరదలు సంభవించినప్పటి నుంచి పౌరులను రక్షించేందుకు.. అధికారులు రెస్క్యూ టీమ్​లను అలెర్ట్ చేశారు. సుమారు 17.5 లక్షల మంది ప్రజలను.. సహాయక సిబ్బంది హెబీ ప్రావిన్స్​ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 9,78,400 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారే. అయితే వరద బాధిత పిల్లలను సెప్టెంబర్ 1 తేదీలోగా పాఠశాలకు వెళ్లేలా చూస్తామని అధికారులు అన్నారు. అలాగే శీతాకాలంలోపు నిర్వాసితులు వారి ఇళ్లకు వెళ్లేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రకృతి విపత్తులో దెబ్బతిన్న ప్రాజెక్టులను 2024 వరదల సీజన్​లోపు.. మిలిగిన అన్ని ప్రాజెక్టులను 2025 నాటికి పునర్ నిర్మిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

China Flooding Effects : గురువారం వరకు 2,237 దెబ్బతిన్న రోడ్ల రీ కన్​స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఇక 1,723 10- కిలోవోల్ట్​ల విద్యుత్ లైన్లు పూర్తిగా దెబ్బతినగా.. అందులో 1,631 లైన్​లను పునరుద్ధరించారు. మిగిలిన ప్రాజెక్టులు మరమ్మతులో ఉన్నాయని తెలిపారు.

చైనాలో వరద బీభత్సం.. 11 మంది మృతి.. 27 మంది గల్లంతు

చైనాలో వరద బీభత్సం- 10 బిలియన్​ డాలర్ల నష్టం

Last Updated : Aug 11, 2023, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.