China Covid rules 2022: కరోనా పుట్టినిల్లు చైనాలో కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతూనే ఉన్నాయి. ఉత్తర కొరియాతో సరిహద్దు నగరమైన దండాంగ్‌లో 50 రోజుల తర్వాత కరోనా బాధితులను చైనా బాహ్య ప్రపంచంలోకి విడిచిపెట్టింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వీరిని కఠినమైన నిబంధనలుండే క్వారంటైన్‌లో డ్రాగన్ నిర్బంధించింది. 50 రోజుల తర్వాత వీరిని ఆంక్షలు విధిస్తూ బయటకు అనుమతించింది. ఇనుప కంచెలు ఏర్పాటు చేసి వాటి మధ్యన బంధువులు, కుటుంబ సభ్యులను కలిసేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దండాంగ్ నగరంలో ఆహారం సహా రవాణపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.
గత రెండు వారాల్లో పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల వారిని మాత్రమే బయటకు వదిలారు. దండాంగ్‌లో ప్రతి సోమవారం మాత్రమే ప్రజలు నిత్యావసరాలు కొనుగోలుకు డ్రాగన్ ప్రభుత్వం అనుమతినిస్తోంది. లాక్‌డౌన్ సడలింపు ప్రకటన వెలువడగానే చాలా మంది ప్రజలు కంచెల వద్దకు వచ్చి తమవారి కోసం ఎదురుచూశారు. ప్రజలను ఇబ్బంది పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని దండాంగ్ మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వసతుల మధ్య క్వారంటైన్‌లో ఉంచినందుకు క్షమాపణలు చెప్పారు.