China COVID Deaths : చైనాలో జీరో-కొవిడ్ విధానం ఎత్తేసిన అనంతరం.. రెండు నెలల్లోనే సుమారు 20లక్షల మరణాలు సంభవించాయని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచం మొత్తం కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా.. చైనా మాత్రం అనేక నెలలపాటు జీరో కొవిడ్ పాలసీని కఠినంగా అమలు చేసింది. ఈ విధానంపై చైనావ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు చెలరేగాయి. ఈ నిరసనలతో దిగివచ్చిన జిన్‌పింగ్ ప్రభుత్వం.. గతేడాది డిసెంబర్‌లో కొవిడ్ ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేసింది. దీంతో ఊహించని స్థాయిలో కొవిడ్ మరణాలు సంభవించాయని అమెరికా అధ్యయనం తెలిపింది. జీరో-కొవిడ్ విధానం ఎత్తేసిన తర్వాత రెండు నెలల్లోనే చైనాలో సుమారు 20లక్షల అదనపు మరణాలు సంభవించి ఉండొచ్చని అమెరికా అధ్యయనం అంచనా వేసింది.
America Research on China COVID Death : చైనాలో కొవిడ్ మరణాలకు సంబంధించి అక్కడి యూనివర్సిటీలు, స్థానిక సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారంపై అమెరికా సియాటెల్‌లోని ఫ్రెడ్ హట్‌షిన్‌సన్ క్యాన్సర్ సెంటర్ అధ్యయనం జరిపింది. చైనాలోని అన్ని ప్రావిన్సుల్లో డిసెంబర్ 2022-జనవరి 2023 మధ్యకాలంలో అన్ని కారణాల వల్ల 18.7లక్షల అదనపు మరణాలు సంభవించాయని గుర్తించింది. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కొవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో 60వేల మంది మృతి చెందారని.. చైనా అధికారికంగా ప్రకటించిన దానికంటే చాలా అధిక స్థాయిలో మృతుల సంఖ్య ఉందని తెలిపింది.
China Zero COVID Policy Easing Deaths : చైనాలో జీరో కొవిడ్ విధానం ఎత్తివేతకు సంబంధించి జరిపిన అధ్యయనంలో అనేక అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్-19 వ్యాప్తి పౌరుల మరణాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇదెంతో ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 70లక్షల మంది కొవిడ్ మరణాలు సంభవించగా.. చైనాలో 1.21లక్షలు మాత్రమే చోటుచేసుకున్నాయి. అయితే, చైనాలో కొవిడ్ మరణాల సమాచారంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రావడం వల్ల.. రోజువారీగా అందించే సమాచారాన్ని డ్రాగన్ కొంతకాలం క్రితం నిలిపివేసింది.
Donald Trump Arrest : ట్రంప్ మళ్లీ అరెస్ట్.. 20నిమిషాల పాటు జైలులో.. తొలిసారి 'మగ్‌షాట్' రిలీజ్