ETV Bharat / international

'అందుకే ఇమ్రాన్ ఖాన్​ను చంపాలనుకున్నా.. ఒక్కడినే ప్లాన్ చేశా'

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​పై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందునే ఇమ్రాన్ ఖాన్​ను చంపేందుకు తాను ప్రయత్నించానని నిందితుడు తెలిపాడు.

Imran Khan attack
ఇమ్రాన్​ ఖాన్​పై దాడి
author img

By

Published : Nov 3, 2022, 9:17 PM IST

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటెయినర్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వజీరాబాద్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు కంటెయినర్‌పైకి ఎక్కిన సందర్భంలో నిందితుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ ఖాన్‌ కుడి కాలికి గాయం కాగా.. పీటీఐ పార్టీకి చెందిన మరికొందరు నేతలకు గాయాలయ్యాయి. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నిందితుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందునే ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేందుకే తాను ఇక్కడికి వచ్చానని నిందితుడు వెల్లడించాడు. ఈ లాంగ్‌ మార్చ్‌ నేపథ్యంలో ఆయన ప్రజల్ని తప్పుదోవపట్టిస్తుంటే చూస్తూ భరించలేకపోతున్నానని.. అందుకే ఆయన్ను చంపేందుకు ప్రయత్నించినట్టు తెలిపాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ను మాత్రమే తాను చంపాలనుకున్నానని.. ఇంకెవరినీ కాదన్నాడు. అందుకే ఇమ్రాన్‌ లాహోర్‌ దాటినప్పట్నుంచి ఆయన్ను చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వివరించాడు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు కాల్పులు జరిపినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నిందితుడు స్పందిస్తూ.. తాను ఒక్కడినేనని.. తనతో ఇంకెవరూ లేరని సమాధానం ఇచ్చాడు.

ఇమ్రాన్‌పై కాల్పుల్ని ఖండించిన నవాజ్‌ షరీఫ్‌..
ఇంకోవైపు, ఈ ఘటనను పీఎంఎల్‌-ఎన్‌ అధినేత, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఖండించారు. ఈ ఘటనలో గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై పీఎంఎల్‌-ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ కూడా స్పందించారు. ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పుల్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ కూడా ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం.. స్థానికేతరులపై ఉగ్రదాడి

భార్యాభర్తల మధ్య గొడవ.. మధ్యలో బాలుడు మృతి.. మతం మార్చుకోకుంటే చంపేస్తానని బెదిరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.