ETV Bharat / international

పార్టీ మీటింగ్​లో పేలుడు.. 44 మంది మృతి.. 150 మందికి పైగా గాయాలు

Pakistan Khyber Pakhtunkhwa Blast News : పాకిస్థాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాక్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరుగుతున్న రాజకీయ సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 44 మంది మృతిచెందగా.. మరో 150 మందికి పైగా గాయపడ్డారు.

pakistan blast news today
pakistan blast news today
author img

By

Published : Jul 30, 2023, 6:39 PM IST

Updated : Jul 31, 2023, 7:59 AM IST

Pakistan Blast News today : పాకిస్థాన్​లో ఓ పార్టీ బహిరంగ సభలో బాంబు పేలుడు సంభవించి 44 మంది మృతిచెందారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అఫ్గానిస్థాన్​ సరిహద్దులోని ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో ఆదివారం జరిగింది. ఇస్లామిక్ పార్టీ జమైత్​ ఉలేమా-ఇ- ఇస్లాం-ఫజల్​ బహిరంగ సభలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఆత్మాహుతి దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. ఘటనా ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.

Pakistan Blast News today
ఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్​
Pakistan Blast News today
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న కార్యకర్తలు

దర్యాప్తునకు పార్టీ చీఫ్ డిమాండ్​
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలంటూ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్​ను డిమాండ్ చేశారు జమైత్​ ఉలేమా-ఇ- ఇస్లాం-ఫజల్ అధ్యక్షుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్​. క్షతగాత్రుల కోసం రక్తదానం చేయాలంటూ పార్టీ కార్యకర్తలను కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తాయని.. పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. వాస్తవానికి ఈ సమావేశానికి పార్టీ నేత హఫీజ్​ హమదుల్లా సైతం హాజరు కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన.. తమ కార్యకర్తలపై అనేక సార్లు దాడులు జరిగాయని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు.

గ్యాస్ సిలిండర్​ పేలి ఆరుగురు మృతి
Gas Cylinder Explosion In Pakistan : అంతకుముందు పాకిస్థాన్​లోని పంజాబ్​ ప్రావిన్స్​లో గ్యాస్​ సిలిండర్​ పేలడం వల్ల మూడంతస్తుల భవనం కుప్ప కూలి ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్​ ప్రావిన్స్​లోని జీలం గ్రాండ్​ ట్రంక్​ రోడ్​లో ఉన్న ఓ హోటల్​లోని వంట గదిలో సిలిండర్​ పేలింది. దీంతో మూడు అంతస్తుల భవంతి కుప్పకూలింది. ప్రమాద సమయంలో శిథిలాలు మీద పడి ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జీలం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విధించి మొత్తం సిబ్బంది, వైద్యులను విధుల్లోకి చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో క్షతగాత్రుడిని రావల్పిండిలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించినట్లు పాకిస్థాన్​ మీడియా పేర్కొంది.

ఇవీ చదవండి : పాక్​లో గ్యాస్​ సిలిండర్​ పేలుడు.. ఏడుగురు మృతి.. సూడాన్​లో 22 మంది..

బార్బెక్యూ రెస్టారెంట్​లో గ్యాస్ పేలుడు!.. 31 మంది దుర్మరణం

Last Updated : Jul 31, 2023, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.