ETV Bharat / international

మీ సాయం విరాళం కాదు.. పెట్టుబడి: జెలెన్‌స్కీ - అమెరికా మద్ధతు కోరిన జెలెన్​స్కీ

ఉక్రెయిన్‌ ఒంటరిది కాదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అన్నారు. యుద్ధం ముగిసే వరకు ఆ దేశానికి అమెరికా అండదండలు కొనసాగుతాయన్నారు.

Zelensky asked the US to support them and supply them with weapons
జెలెన్‌స్కీ, జోబైడెన్‌
author img

By

Published : Dec 22, 2022, 1:02 PM IST

Updated : Dec 22, 2022, 3:20 PM IST

ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసే నిధులు, ఆయుధాలు వంటివి విరాళం కాదని.. అది పెట్టుబడితో సమానమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన నేడు కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "మీ డబ్బు విరాళం కాదు.. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యాలకు పెట్టుబడి. నేను ఇక్కడ ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చిన ఉక్రెయిన్‌ కుప్పకూలదు. సజీవంగానే ఉండి పోరాడుతుంది. ప్రపంచం దృష్టిలో మేము రష్యాను ఓడించాము. శాంతి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్‌ సహకరించారు. ఆయనకు ధన్యవాదాలు. అమెరికా బలంగా.. సమష్టిగా ఉందని చెప్పేందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహకరించాలి" అని జెలెన్‌స్కీ అభ్యర్థించారు.

జెలెన్‌స్కీ ఖాకీ స్వెట్‌షర్ట్‌లోనే అమెరికాలో పర్యటించడం గమనార్హం. యుద్ధం మొదలైన నాటి నుంచి ఆయన మిలిటరీ రంగు దుస్తులు ధరిస్తున్నారు. జెలెన్‌స్కీ కాంగ్రెస్‌ సభలోకి అడుగు పెడుతున్న సమయంలో కొందరు సభ్యులు ఉక్రెయిన్‌ పతాకాల్ని ప్రదర్శించారు.

ఉక్రెయిన్‌ ఒంటరిది కాదు..
జెలన్‌స్కీ తన పర్యటనలో భాగంగా శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ రష్యాతో యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా.. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ ఎప్పటికీ ఒంటరిది కాదని పేర్కొన్నారు. రెండు బిలియన్ డాలర్ల సరికొత్త ప్యాకేజీని బైడెన్‌ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాయింట్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బైడెన్‌ మాట్లాడుతూ.. మిత్రపక్షాలను కలిపి ఉంచడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొంత మంది మిత్రులు యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన, ఆహార కొరత కారణంగా ఇబ్బందికి గురివుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో అందరూ సంఘీభావంతో ఉన్నారన్నారు. యుద్ధం ఆపే ఉద్దేశం పుతిన్‌కు లేదన్నారు.

Last Updated : Dec 22, 2022, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.