John Lee Elected As Honkong Next Leader: చైనా అనుకూల నేత జాన్ లీ.. హాంకాంగ్ నగర నూతన అధిపతిగా ఎన్నికయ్యారు. దీంతో హాంకాంగ్ పరిపాలన వ్యవహారాలపై బీజింగ్ పట్టు మరింత బిగిసింది. ఆదివారం వెలువరించిన ఎన్నికల ఫలితాల్లో జాన్ లీకి 89 శాతం సీట్లు లభించాయి. సుమారు 1500 మంది కమిటీ సభ్యుల్లో చాలా మంది గతంలో హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని భద్రతా ముఖ్య అధికారిగా కఠినంగా అణిచివేసిన లీ వైపే మొగ్గు చూపారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో లీ ఒక్కరే పోటీ చేయడం. దీంతో ఆయన విజయం నల్లేరుపై నడకైంది. 1416 ఓట్లు ఆయనకు అనుకూలంగా వచ్చాయి. జులై ఒకటిన లీ.. ప్రస్తుత నేత కారీ లామ్ నుంచి పగ్గాలు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: మహిళలకు నరకం చూపిస్తున్న తాలిబన్లు.. ఇంట్లోంచి కాలు బయటపెడితే!