ETV Bharat / international

Bangladesh Train Accident Today : ప్యాసింజర్ ట్రైన్, గూడ్స్​ రైలు ఢీ..​ 20 మంది మృతి - బంగ్లాదేశ్​లో రెండు రైళ్లు ఢీ

Bangladesh Train Accident Today
Bangladesh Train Accident Today
author img

By PTI

Published : Oct 23, 2023, 5:29 PM IST

Updated : Oct 23, 2023, 8:13 PM IST

17:26 October 23

Bangladesh Train Accident Today : బంగ్లాదేశ్​లో ఘోర రైలు ప్రమాదం- అనేక మంది మృతి

Bangladesh Train Accident Today : బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయని చెప్పారు.

అధికారుల సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కిశోర్​గంజ్ జిల్లాలోని భైరబ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ​ఢాకాకు వెళ్తున్న ఎగోర్​సింధూర్​ గోధూలీ ఎక్స్​ప్రెస్​ రైలును.. వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. వెంటనే మూడు బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. వీటి కింద కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. పెద్ద క్రేన్​లను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్​ ఫైర్​ సర్వీస్​ చీఫ్​ షాజహాన్​ సిక్దర్​ తెలిపారు. గూడ్స్​ రైలు సిగ్నల్​ను విస్మరించిందని బంగ్లాదేశ్​ తాత్కాలిక జనరల్ మేనేజర్​ నజ్ముల్​ ఇస్లాం తెలిపారు. గూడ్స్ రైలు లోకో పైలట్​, అసిస్టెంట్​ లోకో పైలట్​, గార్డును సస్పెండ్​ చేసినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ కోసం రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Last Updated : Oct 23, 2023, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.