south Africa COVID news: కొత్త ఒమిక్రాన్ ఉప వేరియంట్లు బీఏ.4, బీఏ.5తో ప్రమాదమేనని, ఇవి యాంటీబాడీలను తప్పించుకుంటున్నాయని ఫలితంగా మరో కొత్త వేవ్ వచ్చే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరించింది. అయితే టీకా వేసుకున్న వ్యక్తుల రక్తంలో ఇవి వృద్ధి చెందలేవని పేర్కొంది. ఈ అధ్యయనంలో గతంలో వైరస్ సోకిన 39 మంది నుంచి గత ఏడాది చివర్లో రక్త నమూనాలు తీసుకున్నారు. ఇందులో 15 మందికి టీకా వేశారు. మిగిలిన వారికి వేయలేదు.
"వ్యాక్సిన్ వేసుకున్న సమూహంలో వైరస్‌ను తటస్థీకరించే సామర్థ్యం ఐదు రెట్లు కనిపించింది. వారు మెరుగైన రక్షణలో ఉన్నారు" అని అధ్యయనం పేర్కొంది. టీకా వేసుకోని సమూహంలో యాంటీబాడీలు 8 శాతం తగ్గాయి. దక్షిణాఫ్రికా.. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే ఐదో వేవ్‌లోకి అడుగుపెడుతోంది. పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్ ఉప వేరియంట్లైన బీఏ.4, బీఏ.5లే కారణమని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'కొవిడ్.. దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఇంకా తెలియడంలేదు'