ETV Bharat / international

మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు దుర్మరణం - అమెరికా వార్తలు

Shooting Maryland: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. పశ్చిమ మేరీల్యాండ్​లోని కొలంబియా మెషీన్​ అనే కంపెనీలోకి చొరబడ్డ దుండగుడు.. తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.

authorities-3-dead-trooper-wounded-in-maryland-shooting

author img

By

Published : Jun 10, 2022, 10:22 AM IST

Shooting Maryland: అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషీన్‌ అనే కంపెనీలోకి చొరబడ్డ ఓ సాయుధుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీసు గాయపడ్డాడు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయి. మే 31న.. న్యూ ఒర్లీన్స్‌లో ఓ పాఠశాల స్నాతకోత్సవంలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. జూన్​ 1న ఓక్లహోమాలోని తుల్సా నగరంలో ఓ వ్యక్తి తుపాకీతో చెలరేగాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. జూన్​ 4న రాత్రి ఫిలడెల్ఫియాలో తుపాకులు పేలాయి. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. డౌన్‌టౌన్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌ ప్రాంతంలో గుమికూడిన జనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: అణుబాంబు తయారీలో ఇరాన్!​.. ఏ దేశంపై ప్రతీకారం?

పాకిస్థాన్‌లో హిందువుల సంఖ్య అంత తక్కువా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.