ETV Bharat / international

'అన్నీ మర్చిపోయి ముందుకు సాగండి'.. మాజీ ప్రేయసిపై మస్క్ ట్వీట్ - ఎలాన్ మస్క్ జానీ డెప్ అంబర్​ హెర్డ్

హాలీవుడ్ నటులు జానీ డెప్, అంబర్ హెర్డ్ మధ్య కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. వీరిద్దరూ గొప్పవారని.. అన్ని మర్చిపోయి ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

AMBER HEARD JHONNY DEPP
AMBER HEARD JHONNY DEPP
author img

By

Published : May 28, 2022, 10:52 PM IST

Amber Heard Elon musk: స్టార్ నటులు జానీ డెప్, అతడి మాజీ భార్య అంబర్​ హెర్డ్ కోర్టు కేసుపైనే హాలీవుడ్ దృష్టంతా నెలకొని ఉంది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వాషింగ్టన్​పోస్ట్​లో కథనం రాసినందుకు.. అంబర్​ హెర్డ్​పై పరువు నష్టం దావా వేశారు జానీ డెప్. ప్రస్తుతం ఈ విచారణ వాడీవేడీగా సాగుతోంది. జానీ, అంబర్​లతో పాటు, వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులను... న్యాయమూర్తులు, జ్యూరీ విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ అన్నీ వదిలేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నటీనటులిద్దరూ స్వతహాగా చాలా గొప్పవారంటూ ట్వీట్ చేశారు.

AMBER HEARD JHONNY DEPP
మస్క్ ట్వీట్

మస్క్, అంబర్​ హెర్డ్ ఇదివరకు రెండుసార్లు డేటింగ్ చేశారు. జానీ డెప్​తో విడిపోయిన తర్వాత మస్క్​తో రిలేషన్​షిప్ ప్రారంభించిన అంబర్​ హెర్డ్.. ఏడాది తర్వాత 2017లో విడిపోయారు. మళ్లీ 2018లో కలిశారు. ఈసారి కొద్దిరోజులకే విడిపోయారు. అయితే, జానీ డెప్ మాత్రం.. వీరిద్దరి మధ్య సంబంధాలు చాలా ముందే ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. 2015 ఫిబ్రవరిలో అంబర్​హెర్డ్​తో జానీ డెప్ వివాహం జరిగింది. పెళ్లైన నెల లోపే అంబర్​ హెర్డ్... ఎలాన్ మస్క్​తో డేటింగ్ ప్రారంభించారని ఆరోపిస్తున్నారు.

Elon Musk Amber Heard threesome: ఇదివరకే, ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. జానీ డెప్ ఇంట్లో లేనప్పుడు అంబర్​హెర్డ్​తో కలిసి ఎలాన్ మస్క్ నడిపిన రాసలీలలకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. అంబర్​హెర్డ్​తో పాటు మరో నటి కారా డెలెవింగ్నెతో కలిసి మస్క్ రొమాన్స్ చేశారన్నది ఈ ఆరోపణల సారాంశం. 2016లో లాస్ఏంజిలిస్​లోని జానీడెప్, అంబర్​హెర్డ్​ల అపార్ట్​మెంట్​లోనే వీరు అఫైర్ నడిపారని సమాచారం. కోర్టు డాక్యుమెంట్లలో ఎలాన్ మస్క్ పేరు సైతం ఉంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.