ETV Bharat / international

అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌ జవహరీ హతం

AL QAEDA CHIEF AL ZAWAHIRI DEAD: అల్‌ఖైదా అధినేత అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో జవహరీని హతమార్చినట్లు వెల్లడించారు.

ALL KHAIDHA CHIEF
అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌ జవహరీ హతం
author img

By

Published : Aug 2, 2022, 4:59 AM IST

Updated : Aug 2, 2022, 8:48 AM IST

AL QAEDA CHIEF AL ZAWAHIRI DEAD: ఉగ్రవాదంపై పోరులో అమెరికా కీలక విజయం సాధించింది. అల్​ఖైధా అధినేత అల్- జవహరీని మట్టుబెట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని హతమార్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్​తో 2001 సెప్టెంబరు 11 దాడుల బాధితులకు న్యాయం జరిగిందని అన్నారు. కాబుల్ డౌన్​టౌన్​లోని ఓ ఇంట్లో అల్- జవహరీ తన కుటుంబంతో ఉన్నట్లు అమెరికా ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారని బైడెన్ తెలిపారు.

అమెరికా ప్రజలకు హాని చేస్తే ఎక్కడున్నా వదలం. ఎంతకాలమైనా, ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం. అమెరికా ఇంటిలిజెన్స్ అధికారుల నైపుణ్యం, పట్టుదలకు ధన్యవాదాలు.

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఇదిలా ఉండగా, కాబుల్‌లోని షేర్పూర్‌ ప్రాంతంలోని ఓ నివాసంపై 'వైమానిక దాడి' జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్‌ చేశాడు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఖండించాడు.

ఈజిప్టు సర్జన్‌ అయిన అల్‌-జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారాడు. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3 వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రదారుల్లో ఒకరిగా అల్‌-జవహరీని అమెరికా గుర్తించింది. అప్పటినుంచి వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో ఒకడిగా జవహరీ పరారీలోనే ఉన్నాడు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్‌ లాడెన్‌ హతమార్చిన తర్వాత అల్‌-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. జవహరీ తలపై 25 మిలియన్‌ డాలర్ల రివార్డును యూఎస్‌ ప్రకటించింది.

ఇవీ చదవండి: చైనా హెచ్చరికలు బేఖాతరు.. తైవాన్ విషయంలో పెలోసీ తగ్గేదేలే!

కాలిపోతున్న కాలిఫోర్నియా.. అడవులు దగ్ధం.. 2రోజుల్లోనే విధ్వంసం!

Last Updated : Aug 2, 2022, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.