ETV Bharat / international

ఆందోళనకారులపై ఉక్కుపాదం.. 31మంది మృతి! - undefined

31 civilians killed in a crackdown by the Iranian security forces on protests that erupted after the death of Mahsa Amini

author img

By

Published : Sep 22, 2022, 7:56 PM IST

Updated : Sep 22, 2022, 10:55 PM IST

19:54 September 22

ఆందోళనకారులపై ఇరాన్​ ఉక్కుపాదం.. 31మంది మృతి!

హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంపై అరెస్టయిన ఓ యువతి పోలీసు కస్టడీలో మృతి చెందడంపై.. ఇరాన్‌లో చెలరేగిన అల్లర్లు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత వారాంతం మొదలైన అల్లర్లలో ఇప్పటివరకు 31 మంది చనిపోయినట్లు సమాచారం. ఇందులో ఆందోళనకారులతోపాటు పోలీసులు ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇరాన్‌ కఠిన చట్టాలు, పోలీసు జులుంను వ్యతిరేకిస్తూ టెహ్రాన్‌ సహా 17 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా పలుచోట్ల భద్రతాదళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. నిరసనలకు సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రచారం కాకుండా ఉండేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు మినహా ఇతరులెవరూ ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ వంటివి వినియోగించకుండా ఇప్పటికే ఆంక్షలు విధించారు.

Last Updated : Sep 22, 2022, 10:55 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.