అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫిలడెల్ఫియాలో శనివారం రాత్రి తుపాకులు పేలాయి. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. డౌన్‌టౌన్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్ ప్రాంతంలో గుమికూడిన జనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
వారాంతం కావటం వల్ల సౌత్ స్ట్రీట్‌లో జనసందోహం అధికంగా ఉన్న సమయంలో కాల్పులు జరిగినట్లు వివరించారు పోలీసులు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు వెల్లడించారు. కాల్పులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఘటనాస్థలం నుంచి రెండు హ్యాండ్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్నివదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి: బ్రేకప్ రివెంజ్.. ప్రేయసి ముఖంపై తన పేరును టాటూగా వేసిన ఉన్మాది
ఒక్క పేలుడు.. 43 కుటుంబాల్లో పెను విషాదం.. మరో 450 మందికి...