ETV Bharat / international

భారీ భూకంపం..రిక్టర్​ స్కేల్​పై 6.3 తీవ్రత.. ఐదుగురు మృతి - చైనాలో భూకంపం

south iran earthquake: దక్షిణ ఇరాన్​లో శనివారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో అయిదుగురు మరణించగా, 44 మంది గాయపడ్డారు. మరోవైపు చైనాలోనూ భూకంపం సంభవించింది. అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

south iran earthquake
దక్షిణ ఇరాన్​లో భూకంపం
author img

By

Published : Jul 2, 2022, 9:15 AM IST

south iran earthquake: దక్షిణ ఇరాన్​లో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. ఈ ఘటనలో అయిదుగురు మరణించగా, 44 మంది గాయపడ్డారు. దేశ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున ఈ ఘటన జరగడం వల్ల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతేడాది ఇదే ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల ఒకరు మృతి చెందారు.

ఇరాన్​లో 1990లో సంభవించిన భారీ భూకంపం వల్ల 40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2003లో 6.6 తీవ్రతతో బామ్​ నగరంలో సంభవించిన భూకంపం వల్ల 26,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో పశ్చిమ ఇరాన్‌లో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 600 మందికి పైగా మరణించగా, 9000 మంది గాయపడ్డారు.

చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారిజామున 3.29 నిమిషాలకు ఈ భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఇటీవల అఫ్గానిస్థాన్​లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పటికే పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్గాన్​పై ఈ భూకంపం పెను తీవ్రతను చూపింది. అంతర్జాతీయ సాయం అందించాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది. భూకంపం కారణంగా అఫ్గానిస్థాన్​లో దాదాపు 1000 మంది మరణించగా, సుమారు 1500 మంది గాయపడ్డారు.

ఇవీ చదవండి: నేర విచారణకు మస్తిష్క తరంగాల విశ్లేషణ.. త్వరలోనే సరికొత్త సాంకేతికత!

48 ఏళ్ల క్రితం నాటి బిల్​గేట్స్ రెజ్యూమ్​ వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.