ETV Bharat / international

టీకా పేటెంట్ల సడలింపుల దిశగా డబ్ల్యూటీఓ!

author img

By

Published : Jun 9, 2021, 5:28 AM IST

వ్యాక్సిన్ల పేటెంట్​ భద్రతలో సడలింపులు చేయాలని డబ్ల్యూటీఓ ప్యానెల్​ యోచిస్తోంది. సడలింపులు చేయాలన్న భారత్​, దక్షిణాఫ్రికాలు ప్రతిపాదనకు 60 దేశాలు మద్దతు పలికాయి. అయితే ఈ ప్రక్రియ అమలు మరింత సమయం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐరోపా సహా పలు దేశాల వ్యతిరేకతే అందుకు కారణమని పేర్కొన్నారు.

wto on vaccine patent, వ్యాక్సిన్​ పేటెంట్​పై డబ్ల్యూటీఓ
టీకా పేటెంట్ల సడలింపుల దిశగా డబ్ల్యూటీఓ

కరోనా మహమ్మారిని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనేందుకు వీలుగా టీకాలపై ఉన్న పేటెంట్​ భద్రతను సడలించే దిశగా ప్రపంచ వాణిజ్య సంస్థ అడుగులు వేస్తోంది. మంగళవారం జరిగిన డబ్ల్యూటీఓ ప్యానెల్​ సమావేశంలో పేటెంట్​ హక్కులను సడలించాలన్న భారత్​, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు అమెరికా, చైనా సహా 58 దేశాలు మద్దతు తెలిపాయి.

ఐరోపా విముఖత..

పేటెంట్​ భద్రతను సడలించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని ఐరోపా సమాఖ్య ఇప్పటికే స్పష్టం చేసింది. పేటెంట్​ను రద్దు చేయకుండా.. డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు ప్రొడక్షన్​ లైసెన్స్​ను సంస్థలకు పంపిణీ చేయాలని సూచించింది.

అమలు ఆలస్యం..

పేటెంట్​ సడలింపు ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిక శాతం దేశాల మద్దతు ఉన్నప్పటికీ ఐరోపా సమాఖ్య సహా పలు దేశాల వ్యతిరేకత అడ్డంకిగా నిలుస్తోందన్నారు.

ఇదీ చదవండి : 'వుహాన్ ల్యాబ్​ నుంచే కరోనా లీక్- ఇదే సాక్ష్యం...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.