ETV Bharat / international

బ్రెజిల్​లో కరోనా​ ప్రళయం.. ఒక్కరోజులో 45వేల కేసులు

author img

By

Published : Jul 8, 2020, 8:39 AM IST

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,19,48,244మంది వైరస్​ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 5,46,547మంది మరణించారు. బ్రెజిల్​లో వైరస్​ విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే 45వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి.

worldwide-situation-of-corona-virus-pandemic
బ్రెజిల్​లో కరోనా​ ప్రళయం.. ఒక్కరోజులో 45వేల కేసులు

ప్రపంచంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. రోజురోజుకు కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,19,48,244 కేసులు నమోదయ్యాయి. 5,46,547మంది కరోనాకు బలయ్యారు. అమెరికా, బ్రెజిల్​ సహా ప్రపంచ దేశాలు వైరస్​ ధాటికి గడగడలాడుతున్నాయి.

దేశంకేసులుమరణాలు
అమెరికా30,97,0841,33,972
బ్రెజిల్​16,74,66566,868
రష్యా6,94,23010,495
పెరూ3,09,27810,952
చిలీ3,01,0196,434
స్పెయిన్​2,99,21028,392
బ్రిటన్​2,86,34944,391
మెక్సికో2,68,00932,014
ఇరాన్​2,45,68811,931

45వేల కేసులు...

బ్రెజిల్​లో కరోనా వైరస్​ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 45,305కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్​ కేసుల సంఖ్య 16,74,665 కేసులు నమోదయ్యాయి. 1,254 తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 66,868కి పెరిగింది.

అయితే బ్రెజిల్​లో ఇప్పటివరకు 9,76,977మంది వైరస్​ను జయించారు.

ఇదీ చూడండి:- ఆ దేశాధ్యక్షుడికి కరోనా పాజిటివ్​

ఆ విమానాలపై నిషేధం..

కరోనా సృష్టించిన విలయతాండవాన్ని స్పెయిన్ ​వాసులు ఇప్పట్లో మర్చిపోలేరు. అయితే స్పెయిన్​ రాజధాని రోమ్​కు సమీపంలో నివసిస్తున్న బంగ్లాదేశీయుల సంఘంలో కొత్త క్లస్టర్​ ఏర్పడింది. ఇటీవలే బంగ్లాదేశ్​ నుంచి తిరిగొచ్చిన ఓ ఉద్యోగితో ఇది మొదలైందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్​కు చెందిన విమాన సేవలను నిషేధించింది. ఈ నిషేధం ఒక వారం పాటు ఉండనుంది.

ఇదీ చూడండి:- డబ్ల్యూహెచ్​ఓ నుంచి అమెరికా వైదొలిగేది అప్పుడే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.