ETV Bharat / international

అమెరికాలో కోటిన్నర దాటిన కరోనా కేసులు - కరోనా వైరస్​

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 5 లక్షల మందికిపైగా వైరస్​ సోకింది. అమెరికాలోనే 1.73 లక్షల మంది వైరస్​ బారినపడగా.. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటిన్నర దాటింది. బ్రెజిల్​, రష్యాలతో పాటు టర్కీలోనూ వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉంది.

world corona
అమెరికాలో కోటిన్నర దాటిన కరోనా కేసులు
author img

By

Published : Dec 7, 2020, 7:26 AM IST

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి మహా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు వేలాది మందికి సోకుతూ రాకెట్​ వేగంతో దూసుకుపోతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 5.34 లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. ఏడున్నరవేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత కొత్త కేసుల నమోదులో భారత్​, టర్కీ, రష్యా, బ్రెజిల్​లు ఉన్నాయి.

మొత్తం కేసులు: 67,377,122

మరణాలు: 1,541,370

కోలుకున్నవారు: 46,571,781

క్రియాశీల కేసులు: 19,263,971

  • అగ్రరాజ్యం అమెరికాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 1,73,861 కేసులు నమోదయ్యాయి. 1,076 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య కోటిన్నర దాటింది.
  • టర్కీపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకు 30 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 30,402 మందికి వైరస్​ సోకింది. 195 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 8.28 లక్షలు, మరణాలు 14.9 వేలకు చేరుకున్నాయి.
  • రష్యాలోనూ వైరస్​ ఉద్ధృతి అధికంగానే ఉంది. కొత్తగా 29వేలకుపైగా కేసులు వచ్చాయి. ఆ తర్వాత బ్రెజిల్​లో కొత్త కేసులు 26 వేలకుపైగా నమోదయ్యాయి. ఇటలీలో 18వేలు, బ్రిటన్​లో 17 వేలకుపైగా మందికి వైరస్​ సోకింది. ఫ్రాన్స్​, మెక్సికో, ఇరాన్, ఉక్రేయిన్​​లలో 11వేల చొప్పున కొత్త కేసులు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా15,159,529288,906
బ్రెజిల్6,603,540176,962
రష్యా2,460,77043,141
ఫ్రాన్స్​ 2,292,49755,155
ఇటలీ1,728,87860,078
యూకే1,723,24261,245
స్పెయిన్​1,699,14546,252

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.