ETV Bharat / international

129 మంది పిల్లలకు తండ్రి.. టార్గెట్​ 150! - Sperm Donor 129 children

Worlds Most Prolific Sperm Donor: చాలా మంది దంపతులకు ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అది ఎలా సాధ్యం అంటారా? మీరే చూడండి.

fathered-129-children
129 మంది పిల్లలకు తండ్రి.
author img

By

Published : Jan 28, 2022, 6:36 AM IST

Worlds Most Prolific Sperm Donor: ప్రస్తుత కాలంలో దంపతులు ఇద్దరు లేదా ముగ్గురు సంతానాన్ని కోరుకుంటున్నారు. ఐదారుగురు పిల్లలు ఉన్నవారినీ చూశాం. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 129 పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటారా.. వీర్యం దానం చేయడం ద్వారా. పాశ్చాత్య దేశాల్లో వీర్యదానం సంస్కృతి కొత్తేమీ కాదు. అందుకు అక్కడి చట్టాలు కూడా అనుమతిస్తాయి. యూకేకు చెందిన క్లైవ్ జోన్స్ (వయసు 66 సంవత్సరాలు) వీర్యదానం చేయడం ద్వారా 129 పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో తొమ్మిది మంది త్వరలో పుట్టబోతున్నారు.

తనకు 58 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వీర్యం దానం చేస్తున్నట్టు తెలిపాడు. స్పెర్మ్‌ ఇచ్చేందుకు డబ్బులు కూడా తీసుకోవడం లేదని వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచంలో తానే ఎక్కువమందికి వీర్యదానం చేసిన వ్యక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరికొన్నేళ్లపాటు వీర్యదానం చేస్తానని, 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్యదానం చేయనని క్లైవ్‌ పేర్కొన్నాడు.

అయితే, క్లైవ్ అధికారికంగా స్పెర్మ్ డోనర్ కాదు. బ్రిటన్‌లో స్పెర్మ్ డోనర్‌ గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. ఈ కారణంగా ఫేస్‌బుక్‌ ద్వారా కస్టమర్లతో కనెక్ట్‌ అయి ఉచితంగా వీర్యదానం చేస్తున్నాడు. బ్రిటన్‌లో చాలా క్లినిక్‌లు వీర్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపారు. ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నానని క్లైవ్ చెబుతున్నాడు.

10 సంవత్సరాల క్రితం వార్తాపత్రికలో వచ్చిన ఒక కథనాన్ని చదివిన తరువాత పిల్లలు లేని వ్యక్తులు ఎంత మానసిక వేదనను అనుభవిస్తారో తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. అయితే, యూకే హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ.. క్లైవ్‌కు హెచ్చరిక జారీ చేసింది.

సాధారణంగా బ్రిటన్‌లో స్పెర్మ్ డొనేషన్, కొనుగోలు చేయడం లైసెన్స్ పొందిన క్లినిక్ ద్వారా మాత్రమే చేయాలి. క్లైవ్ వీటిని పాటించకపోవడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'ఒమిక్రాన్‌పై ప్రస్తుత ఔషధాల పనితీరు భేష్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.