ETV Bharat / international

కరోనా పంజా: ఒక్కరోజులో 2.72లక్షల కొత్త కేసులు

ప్రపంచ దేశాలపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సగటున రోజుకు రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 2.72లక్షల మందికి వైరస్​ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 3.17కోట్లు దాటింది. వీరిలో 9.74లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మెక్సికోలో కేసుల సంఖ్య 7లక్షలు దాటింది.

కరోనా పంజా: మెక్సికోలో 7లక్షలు దాటిన కేసులు
WORLD WIDE CORONA VIRUS CASES
author img

By

Published : Sep 23, 2020, 8:32 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా 2లక్షల 72వేల మంది వైరస్ ​బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 17లక్షలు దాటింది. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 9లక్షల 74వేల మందికిపైగా మరణించారు. ఇప్పటివరకు 2.33 కోట్ల మంది వైరస్​ను జయించారు. అన్ని దేశాల్లో కలిపి 74లక్షలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి.

  • అమెరికాలో కొవిడ్​ పంజా విసురుతూనే ఉంది. కొత్తగా 35,696 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య 70.97 లక్షలకు చేరింది. వైరస్​తో పోరాడుతూ కొత్తగా 969 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 2,05,471కి చేరింది.
  • బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూ.. మరో 35,252 కరోనా కేసులు వెలుగు చూశాయి. బాధితుల సంఖ్య 46లక్షలకు సమీపించింది. వైరస్​ కారణంగా మరో 809 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 1.38లక్షలు దాటింది.
  • రష్యాలో కొత్తగా 6,215 కరోనా కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 11,15,810కు ఎగబాకింది. తాజాగా 160 మంది మృతి చెందారు. ఫలితంగా మరణాల సంఖ్య 19,649కు చేరింది.
  • కరోనా కేసుల పరంగా నాలుగో స్థానంలో కొలంబియాలో మంగళవారం ఒక్కరోజే 7,102 మందికి మహమ్మారి సోకింది. మొత్తం కేసుల సంఖ్య 7,77,537కు చేరింది. కొవిడ్​ ధాటికి మరో 173 మంది ప్రాణాలు కోల్పోగా.. చనిపోయిన వారి సంఖ్య 24,570కు పెరిగింది.
  • మెక్సికోలో మరో 2,917 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 580కు చేరింది. 611 మంది కరోనా​తో చనిపోగా.. మృతుల సంఖ్య 73,697కు ఎగబాకింది.
  • స్పెయిన్​లో కొత్తగా 10,799 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 6,82,267కు చేరింది. 241 మరణాలతో.. మృతుల సంఖ్య 30,904కు పెరిగింది.

ఇదీ చదవండి: త్రీడీ పరిజ్ఞానంతో మెదడుతో కంప్యూటర్ల అనుసంధానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.