ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు సుమారు 2.17 కోట్ల కేసులు బయటపడ్డాయి. మరో 7.7 లక్షల మంది వైరస్ కారణంగా మరణించారు. అయితే పెరుగుతున్న కేసులకు దీటుగా రికవరీ రేటు గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 1.44 కోట్ల మందికి వైరస్ నయమైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇరాన్లో అలా..
ఇరాన్లో తాజాగా 2,133 మందికి కొవిడ్ నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 3,43,203కు చేరింది. మరో 147 కొత్త మరణాలతో మృతుల సంఖ్య 19,639కి పెరిగింది.
బంగ్లాదేశ్‌లో మరో 2 వేలకు పైగా..
బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 2,024 వైరస్ కేసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 2,76,549కి పెరిగింది. కరోనాతో మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 3,657కు చేరింది.
నేపాల్‌లో..
నేపాల్‌లో మరో 641 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 26,660కి ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 104కు చేరింది.
ఇప్పటివరకు ఆ దేశంలో 17,335 మందికి వైరస్ నయమవ్వగా.. మరో 9,221 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
సింగపూర్‌లో..
సింగపూలో కొత్తగా 86 మంది వైరస్ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 55,747కు పెరిగింది. ఇప్పటివరకు ఆ దేశంలో వైరస్ కారణంగా 27 మరణాలు సంభవించాయి.
ఆయా దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 5,531,309 | 172,630 |
బ్రెజిల్ | 3,317,832 | 107,297 |
రష్యా | 922,853 | 15,685 |
దక్షిణాఫ్రికా | 583,653 | 11,677 |
పెరూ | 525,803 | 26,075 |
ఇదీ చదవండి: వారం తర్వాతే రష్యా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగం!