ETV Bharat / international

'టీకా అసమానతల'పై డబ్ల్యూటీఓ ఆందోళన - కొవిడ్​ టీకా పంపిణీ

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు అత్యధికంగా ధనిక దేశాలే పొందటంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచ వాణిజ్య సంస్థ అధినేత నగోజీ ఒకోంజో. టీకా పొందటంలో అసమానతలు ఆమోదయోగ్యం కాదన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టీకా తయారీకి సహకరించే వ్యవస్థ రూపకల్పనకు మద్దతిస్తామని తెలిపారు.

WTO Director general
ప్రపంచ వాణిజ్య సంస్థ అధినేత నగోజీ ఒకోంజో
author img

By

Published : Apr 2, 2021, 5:17 AM IST

కరోనా వ్యాక్సిన్లు పొందటంలో దేశాల మధ్య అసమానతలు ఆమోదయోగ్యం కాదన్నారు ప్రపంచ వాణిజ్యం సంస్థ(డబ్ల్యూటీఓ) అధినేత నగోజీ ఒకోంజో. అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకా తయారీ సామర్థ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు పొందేందుకే అనుకూలంగా ఉండటం సరికాదని పేర్కొన్నారు.

మహమ్మారుల సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వయంచాలితంగా, సాకేతికంగా వ్యాక్సిన్లు తయారీకి అవకాశం కల్పించే వ్యవస్థ రూపకల్పనకు తాను మద్దతు ఇస్తానన్నారు ఒకోంజో. డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఫ్రాన్స్​ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మైరేతో సమావేశం అనంతరం ఈ మేరకు వెల్లడించారు ఒకోంజో.

" ప్రస్తుతం కేవలం 10 దేశాలే 70 శాతం వ్యాక్సిన్లు పొందటం అనేది ఆమోద యోగ్యం కాదు. టీకా అసమానతలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. "

- నగోజీ ఒకోంజో, డబ్ల్యూటీఓ డైరెక్టర్​ జనరల్​.

కొవిడ్​-19 వ్యాక్సిన్​ ఉత్పత్తికి డబ్ల్యూటీఓ సాయం చేయాలని దక్షిణాఫ్రికా, భారత్​ నేతృత్వంలోని ప్రయత్నాలకు వాణిజ్య సంస్థ సభ్య దేశాలు సమర్థించాయి. అయితే.. ఈ ప్రయత్నాలను వ్యతిరేకించాయి పలు సంపన్న దేశాలు. అది భవిష్యత్తు ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: డబ్ల్యూటీఓ డైరెక్టర్​ జనరల్​గా ఆఫ్రికన్​ మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.