ETV Bharat / international

వెనక్కి తగ్గి దెబ్బకొట్టడమే.. రష్యా వ్యూహమా?

Russia use Iraq strategy: ఉక్రెయిన్​తో జరుగుతున్న యుద్ధంలో రష్యా పలు వ్యూహాలను ప్రయోగిస్తోంది. 1991లో ఇరాక్​తో అమెరికా యుద్ధానికి దిగింది. ఆ యుద్ధంలో యూఎస్​ దళాలు మందగమనంగా వెళ్తున్నాయని అమెరికా నాటి జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ కొలిన్‌ పావెల్‌ ఓ విలేకర్ల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా రష్యా దళాలు కూడా ఉక్రెయిన్‌లో ఓ క్రమపద్ధతిలో నిదానంగా కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ఉక్రెయిన్‌లో సైనిక చర్య పూర్తిగా ప్రణాళిక ప్రకారమే సాగుతోందని పేర్కొన్నారు.

russia ukraine war
రష్యా ఉక్రెయిన్ యుద్ధం
author img

By

Published : Mar 6, 2022, 2:25 PM IST

russia use iraq strategy: 1991 నాటికి అమెరికా అత్యంత శక్తిమంతమైన దేశంగా అవతరించింది. ఆ సమయంలో ఇరాక్‌పై యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం చాలా నిదానంగా జరుగుతోన్న సమయంలో.. అమెరికా నాటి జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ కొలిన్‌ పావెల్‌ ఓ విలేకర్ల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చుకొన్నారు. అమెరికా దళాలు ఓ క్రమపద్ధతిలో మందగమనంగా వెళుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా రష్యా దళాలు కూడా ఉక్రెయిన్‌లో ఓ క్రమపద్ధతిలో నిదానంగా కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో సైనిక చర్య పూర్తిగా ప్రణాళిక ప్రకారమే సాగుతోందని పేర్కొన్నారు. పరిణామాలు మాత్రం రష్యా దళాల మందగమనాన్ని సూచిస్తున్నాయి.

నౌకాశ్రయాలపై కన్ను..

రష్యా సేనలు దాదాపు 65 కిలోమీటర్ల పొడవైన వాహన శ్రేణిని ఉక్రెయిన్‌ ఉత్తర భాగంలోని రాజధాని కీవ్‌ నగరం సరిహద్దులకు తరలించి రోజుల తరబడి తాపీగా ఎదురు చూస్తున్నాయి. నగరాన్ని దిగ్బంధించి మెల్లగా ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో ఇక్కడ రష్యా పనిచేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ తీర ప్రాంత నగరాలను స్వాధీనం చేసుకొని.. ఒక వైపు నుంచి పశ్చిమ దేశాలతో సంబంధాలను తెగ్గొట్టాలన్నది రష్యా లక్ష్యం.

ఈ నేపథ్యంలో కీవ్‌ సరిహద్దుల్లో సేనలను నిలబెట్టి.. అజోవ్‌ సముద్రంలోని కీలక నౌకాశ్రయమైన మారియుపోల్‌పై దాడులను తీవ్రం చేసింది. ఈ నగరం స్వాధీనం చేసుకొంటే అజోవ్‌ సముద్రంతో ఉక్రెయిన్‌కు సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. మరోపక్క ఖెర్సాన్‌ నగరాన్ని ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకొంది. నల్ల సముద్రంలో కీలకమైన ఒడెస్సా రేవును స్వాధీనం చేసుకోవడంపై దృష్టిపెట్టింది. ఈ నగరం స్వాధీనమైతే నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌ పూర్తిగా పట్టుకోల్పోతుంది. ఈ మార్గంలో పశ్చిమ దేశాల నుంచి భారీ ఆయుధాలు వచ్చే అవకాశం ఉండదు.

క్రిమియా నుంచి దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడం రష్యాకు బాగా కలిసొచ్చే అంశం. దీనికి తోడు మారియుపోల్‌ నగరంపై పట్టు సాధిస్తే క్రిమియా నుంచి డాన్‌బాస్‌ ప్రాంతంలోని రెండు వేర్పాటు ప్రాంతాలు.. ఆపై రష్యా ప్రధాన భూభాగం నుంచి దళాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. ఆ తర్వాత వీటిని ఆధారంగా చేసుకొని ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతాలపై గురిపెట్టవచ్చని రష్యా వ్యూహం.

సమాచార యుద్ధ తంత్రాన్ని నమ్ముకున్న ఉక్రెయిన్‌..

ఉక్రెయిన్‌ తాజాగా సైనిక ఘర్షణలో సమాచారాన్ని బలమైన ఆయుధంగా వాడుకొని.. రష్యా దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే 'ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌' ప్రచారం. ఉక్రెయిన్‌కు చెందిన ఓ మిగ్‌-29 విమానం దాదాపు ఆరు రష్యా విమానాలను కూల్చేసినట్లు విపరీతంగా ప్రచారం చేశారు. వీటిల్లో రష్యా సుఖోయ్‌-35లు కూడా ఉన్నట్లు చెప్పుకొన్నారు. ఈ విమానం వీడియోగా డిజిటల్‌ కాంబాట్‌ సిమ్యూలేటర్‌ వరల్డ్‌ అనే వీడియోగేమ్‌ ఫుటేజీని పోస్టు చేశారు. 2020లో సిరియాలో చిత్రీకరించిన ఫుటేజీలను కూడా తాజాగా జరిగినట్లు ప్రచారంలోకి తీసుకొచ్చినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫ్యాక్ట్‌ చెక్‌లో బయటపడింది.

రష్యా సేనలు దాదాపు 65 కిలోమీటర్ల పొడవైన వాహనశ్రేణిని కీవ్‌ వద్ద మోహరించారంటే ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ఉండవు. ఈ ప్రాంతంలోని గగనతలంపై పట్టు లేకపోతే రష్యా అంత భారీ కాన్వాయ్‌ను అక్కడికి పంపదు. ఎందుకంటే డ్రోన్ల వంటి వాటికి ఆ కాన్వాయ్‌ అత్యంత తేలిగ్గా ఎరగా మారిపోతుంది.

ప్రజల ప్రతిఘటనే రష్యా ఊహించలేదు..!

2014లో క్రిమియా ఆక్రమణ వలే పెద్దగా ప్రజా ప్రతిఘటన ఉండదని రష్యా భావించినట్లు అర్థమవుతోంది. మరోపక్క మాస్కో అంచనాలకు భిన్నంగా స్థానిక ఉక్రెయిన్‌ వాసులు చేతికి దొరికిన ఆయుధాలతో రష్యాదళాలపై తిరగబడుతున్నారు. పెట్రోల్‌ బాంబులు, రహదారులపై అడ్డంకులు.. ఇలా రష్యా సేనలను ముందుకు కదలనీయడంలేదు. రష్యా బలగాలపై పెద్ద దాడులు చేయగల ఆయుధాలను పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున ఇవ్వలేదు. దీంతో కొంత నష్టాలు చవిచూస్తున్నా.. రష్యా సేనలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. మరోపక్క ఉక్రెయిన్‌ తరఫున పోరాడేందుకు అమెరికా, పశ్చిమ దేశాల్లోని పౌరులు, మాజీ సైనికులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా సేనలకు రానున్న రోజుల్లో మరింత ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి: 'రష్యాపై పోరాడేందుకు సై అంటున్న ఉక్రెయిన్​ యువకులు'

'నో ఫ్లై జోన్‌'కు అవకాశం ఎంత? నాటో వెనకడుగుకు కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.