ETV Bharat / international

'కరోనా మరణాల్లో ప్రపంచం విషాద మైలురాయిని దాటింది'

author img

By

Published : Jul 8, 2021, 11:50 AM IST

టీకా (Corona vaccine) లభ్యతలో అసమానత కారణంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచం.. 40 లక్షల కొవిడ్ మరణాల విషాద మైలురాయిని దాటిందని చెప్పారు.

COVID-19
కరోనా

40 లక్షల కరోనా(Corona) మరణాలతో ప్రపంచం ఒక 'విషాద మైలురాయి'ని దాటిందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్​. ఈ మహమ్మారితో ప్రమాదకర స్థితికి చేరుకున్నట్లు వ్యాఖ్యానించారు.

"మహమ్మారి వేళ ప్రమాదకర దశకు ప్రపంచం చేరుకుంది. 40 లక్షల కరోనా మరణాలతో ఒక విషాద మైలురాయిని దాటాం. నిజానికి అంతకన్నా ఎక్కువే చనిపోయి ఉంటారు. భారీ స్థాయిలో టీకా పంపిణీ చేసిన దేశాలు.. మహమ్మారి అంతరించిపోయిందన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆంక్షలను సడలిస్తున్నాయి."

- టెడ్రోస్ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్

టీకా అసమానత వల్లే..

"చాలా కొద్ది దేశాలు అధిక వాటా టీకాలు తీసుకునే.. టీకా జాతీయవాదం చాలా అనైతికం. టీకా ఉత్పత్తి, పంపిణీలో అసమానత కారణంగా.. వైరస్​ వేరియంట్లు టీకాలను జయించగలుగుతున్నాయి. ఫలితంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి కేసులు, ఆస్పత్రుల పాలయ్యేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాల్లో ఆక్సిజన్ కొరతతో మరణాలు విజృంభిస్తున్నాయి." అని టెడ్రోస్ అన్నారు. ఈ దశలోనూ ఇంకా లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందకపోవడం విచారకరమని చెప్పారు.

ఇదీ చూడండి: WHO: ఆంక్షలు సడలించే ముందు జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.