ETV Bharat / international

'లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం' - విద్యార్థులు చదువుకు దూరం

ప్రపంచ విద్యావ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఐక్యరాజ్యసమితి జనరల్​ సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యకు చాలామంది విద్యార్థులు దూరమైనట్లు పేర్కొన్నారు.

UN chief
గుటెరస్​
author img

By

Published : Aug 2, 2021, 8:18 AM IST

Updated : Aug 2, 2021, 9:55 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ విద్యావ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ అన్నారు. లక్షలాది మంది బడిపిల్లలు పాఠశాలలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు.

"ప్రస్తుతం మనం విద్యా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. కొవిడ్​ కారణంగా 15 కోట్ల 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. ఇందులో 2 కోట్ల 50లక్షల మంది తిరిగి బడికి రాకపోవచ్చు. సమర్థవంతమైన మహమ్మారి పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంపొందించడం, డిజిటల్​ విధానాన్ని ప్రోత్సహించడం చేయాలి. దీంతో భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొగలం."

-ఆంటోనియో గుటెరస్​

జాన్​ హాప్​కిన్స్​ యూనివర్సిటీ వెల్లడించిన తాజా డేటా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 19 కోట్ల 80 లక్షలకు చేరాయి. మరణాలు 40 లక్షల 22 వేలకు చేరుకున్నాయి.

ఇదీ చూడండి: 'డెల్టాతో దారుణంగా మారనున్న పరిస్థితులు'

Last Updated : Aug 2, 2021, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.