ETV Bharat / international

'అత్యంత వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్'

author img

By

Published : Jun 24, 2021, 10:49 AM IST

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో బయటపడిందని.. దీని వేగం ఇలాగే కొనసాగితే మరిన్ని దేశాలకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది. గడచిన రెండు వారాల్లోనే కొత్తగా 11 దేశాల్లో బయటపడినట్లు పేర్కొంది.

DELTA
డెల్టా వేరియంట్

అత్యంత వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా వేరియంట్‌ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే మరింత ప్రబలంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అంచనా వేసింది. ప్రస్తుతం 85దేశాల్లో బయటపడిన ఈ వేరియంట్‌.. మరిన్ని దేశాల్లోనూ నమోదయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ఈనెల 22న సంక్రమిక రోగవిజ్ఞాన వారాంతపు (వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్​డేట్) వివరాల విడుదల సందర్భంగా డబ్ల్యూహెచ్​ఓ ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో ఆల్ఫా వేరియంట్‌, 119దేశాల్లో బీటా, 71దేశాల్లో గామా, 85దేశాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. రెండువారాల వ్యవధిలోనే డెల్టా వేరియంట్‌ కొత్తగా 11 దేశాల్లో బయటపడినట్లు తెలిపిన డబ్ల్యూహెచ్​ఓ.. ఈ వేరియంట్‌ మరిన్ని దేశాల్లో నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే డెల్టా వేరియంట్‌.. అల్ఫా కంటే ప్రమాదకరస్థాయిలో సంక్రమిస్తున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.