ఇటలీ రోమ్ నగరంలో లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉండగా ఓ మహిళ తన తాబేలును తీసుకొని వాకింగ్‌కు వచ్చింది. ఇందుకు ఆగ్రహించిన అక్కడి పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన ఆమెకు 400 యూరోల జరిమానా విధించారు.
" సరైన కారణం లేకుండా 60 ఏళ్ల మహిళ బయట తిరగడాన్ని గుర్తించాం. ఆమె ఓ తాబేలును వెంట తీసుకొని నడుస్తోంది. అందుకు ఆ మహిళకు 400 యూరోల జరిమానా విధించాం. ఆ తాబేలు పెద్ద పిజ్జా పరిమాణంలో ఉంది. దానికి కనీసం బెల్టు కూడా పెట్టలేదు."
-- రోమన్ పోలీసులు
ఇటలీలో కరోనాకు ఇప్పటివరకు 20 వేల మందికిపైగా బలయ్యారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. కాసేపు పెంపుడు కుక్కను తీసుకుని రోడ్డుపై నడిచేందుకు అనుమతిస్తున్నారు. కానీ... తాబేలుతో మహిళ బయటకు రావడంపై మాత్రం తీవ్రంగా స్పందించారు.
ఇదీ చదవండి: కరోనా భయాల మధ్యే దక్షిణ కొరియాలో ఎన్నికలు